Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శానన భాషా పరిణామం

115

అనునాసికాలు తమ వర్గాక్షరాలతో కలిసినప్పుడు వ్రాతలో అనుస్వారాలు అవుతాయి. అవిగాక కాన్కి(SII 6.639.2, 1147), మన్చి (తె. శా. 1.13.33. 1170), తంఱిి (SII 6. 631.4, 1286) మొ.వి. గమనార్హం, మిగిలిన హల్లులకు ఉదాహరణలు: వడ్లు (పై. 6.169.5, 1167), అట్లు (పై-4.671.18. 1130), కొల్చు (పై 5.1188.54, 1250), పెర్లు ( NI 2.59.24,1167), కఱ్త(SII 5.167.15, 1200) మొ.వి.

   4.31. నామప్రాతిపదికలు (noun stems) రెండురకాలు : 1. అవి భాజ్యం (Simple), 2.విభాజ్యం(Complex and Compound). అవిభాజ్యం-దేశిపదాలు, ఎరువుమాటలు అని రెండురకాలు. ఊరు (SII 5.70.10, 1177), ఇల్లు (పై. 10,184.80, 1154) మొ. వి, దేశిపదాలు. ఎరువు మాటల్లో సంస్కృతంనుంచి ప్రాకృతాల నుంచీ వచ్చినవి అని రెండు రకాలున్నాయి. భూమి (పై. 5.1046.10,1187) మొ. వి. సంస్కృతం నుంచి వచ్చినవి. వీటినే మన వైయాకరణులు తత్సమపదాలన్నారు. ఠక్కురు (పై. 6.897.6, 1298) డేరా (పై. 5.1216,6, 1314) మొ.వి. ప్రాకృతాల నుంచి వచ్చిన ఋణపదాలు. ఇవిగాక పిరాట్టి (తె. శా. 1.71.12, 1258), వళిక (SII 10,565.12, 1891) మొ. అన్యదేశ్యాలు కూడా ఈ యుగంలో క్వాచిత్క౦గా కనిపిస్తాయి.
   విభాజ్య ప్రాతిపదికల్ని ప్రధానంగా రెండురకాలుగా చెప్పవచ్చు. 1. ఏకధాతుకం (derivatives), 2. బహుధాతుకం (compounds), ఏకధాతుకం-కృత్తులని, తద్ధితాలనీ రెండు రకాలు.
   4.32. కృత్తులు : మూలధాతువుల పైచేరే ప్రత్యయాలు. ఇవి దేశిపదాలు గానే ఉంటాయి.
  (క) -ఇకి/-ఇక: ఏలికి ( SII 6.649.10, 1160), కానిక (పై.  10.465,99, 1280) మొ.వి. ఇకారం లేకకూడా రావచ్చు కాన్కి (పై.6.692, 1147).