ఈ పుటను అచ్చుదిద్దలేదు
110
తెలుగు భాషా చరిత్ర
<నాయిండు ) [SII 10.321.9, 1248 ], ఆచంద్రార్కస్తాహిగా (పై. 10.510,8, 13;5) మొ. వి. పయిఁడి అనడానికి ఈయుగంలో పహిండి/ పైండి రూపాలు ఉన్నాయి. పసిండి రూపం బొత్తుగా కనిపించదు. అందులోను పహిండి రూపమే చాలా తరచుగా కనిపిస్తుంది, (SII 4.1142.7,1142, 10.431. 27,1272) మొ. వి.
4.14. ఆపదాది రేఫకు పరమయ్యే హల్లులు సాధారణంగా ద్విత్వంగా వ్రాయడం శాసనభాషలో కనిపిస్తుంది. సవ్వ౯ (సర్వ), చక్రవత్తి౯ (చక్రవర్తి, రేచెల్ల౯ (రేచెర్ల) మొ.వి. ఇట్టి వానిలో రేఫలోపించడం ఈయుగంలో తరచుగా కనిపిస్తుంది. అఖoడపత్తి (SII 6-995. 14, 1288), సమప్పించు (పై. 5.15, 1.10,1305) మొ.వి. రేఫలోపించని రూపమైన ఇద్ధ౯ఱు ( పై. 6.941.12, 1299) శబ్దం ఫై వాటిలో చాలా ముఖ్యమైంది. ఇందలి రేఫలేని రూపం ఈయుగానికి పూర్వమే కనిపించినా ఈ ఒక్క ప్రయోగం మాత్రం ఈయుగంలో రేఫతో కనిపిస్తుంది. ఇది విశాఖ ప్రాంతంలోనిది. ఈ ప్రాంతమందలి అనేక ప్రాచీన రూపాల్లో ఇదీ ఒకటి అనుకోవచ్చు.
4.15. పై రేఫకు వర్ణవ్యత్యయం జరగడం కూడా ఈ యుగంలో సాధారణంగా కనిపిస్తుంది. ఉదా. ప్రెగ్గడ (SII 10.73.111, 1115), <పెగ్గ౯డ (పై.6.217.4, 1129), ద్రుగ్గాదేవి. (పై. 5-1217.8,1290) (<దుర్గాదేవి) మొ వి.
4.16. ఆదిహల్లుపైన రేఫ సంక్లిష్టమై ఉంటే అట్టి రేఫకు లోపం కావడం ఈయగంలో క్వాచిత్కంగా కనివిస్తుంది. మాను ( SII 10.241.10, 1185), < మ్రాను, తావు (NI 1.25. 69, 1284) < త్రావు, బిందావనం (SII 5.4.12, 1394) < బ్రిందావనం.
ప్రెగ్గడ శబ్దంలోనూ ఈలోపం తరచుగా కనిపిస్తుంది, కాని ఇది వర్ణవ్యత్యయానికి ముందుగాను తర్వాతగాని జరిగి ఉండవచ్చు, పెగ్గ౯డ > పెగ్గడ ; లేదా పెగ్గ౯డ > ప్రెగ్గడ > పెగ్గడ. వర్ణవ్యత్యయం రేఫలోపం రెండూ ఈ యుగంలో జరుగుతూ ఉండటంచేతనూ, అది సంశ్లిష్టంలో రేఫలోపం చాలా క్వాచిత్కంగా కనిపించుటంచేతనూ పై రేఫలోపం వర్ణవ్యత్యయానికి ముందే జరిగి ఉంటుందనవచ్చు (చూ. 4 14),