పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసనభాషా పరిణామం

109

    4.12. -న్ఱ్-/-oఱ్-/ ్రఱ్ ->-oడ్ర్-; తన్ఱి (SII 6.917.5, 1340), ఈ ఒక్కటి తప్ప తక్కినవన్నీ ఆనుస్వారంతోనే కనిపిస్తాయి. తంఱి (పై. 4.1119.15,1261), పంఱెండు (పై. 6.937.7,1359), ఎనుమంఱు (పై. 5.1052.10,1350), ఒత్తుకాంఱు (పై. 6.937.7, 1349), వాస్యకాoఱు (పై. 6.1116.13.1376) మొ.వి, పై వాటిలో రెండు ప్రయోగాలు తప్ప తక్కినవన్నీ విశాఖజిల్హాలోనివే, ఆరెంటిలో ఒకటి గుంటూరికి మరొక్కటి తూర్పుగోదావరికి సంబంధించినవి.
     పై ప్రయోగాలకు మిగిలిన శాసనాల్లోను, సారస్వతభాషలోను తండ్రి, పండ్రెండు, ఎనుమండ్రు మొ. రూపాలే కనిపిస్తాయి. వీటిలో సాహిత్యప్రయోగాలు ప్రాచీనరూపాలా ? లేక పై శాసనరూపాలు ప్రాచీనమైనవా ? చారిత్రకంగా చూస్తే -న్ఱ్ ప్రాచీనస్వరూపమని, -న్ఱ్ రూపానికి అర్వాచీనరూపం -౦డ్ర్- అనీ చెప్పవచ్చు. తండ్రి శబ్డానికి ప్రాచీనరూపం తన్ఱి అనడానికి ఈకింది ఆధారాలున్నవి. తెలుగు, తండ్రి, కుఇ,తంజి, కువి. తంజి. వీటిని పునర్నిర్మాణం (re-construction) చేస్తే *తన్ఱి రూపం వస్తుంది.
     పండ్రెండు శబ్డానికి ప్రాచీనరూపం *పన్‌ + రెండు (>పన్‌ - ఱెoడు> పండ్రెoడు) అనవచ్చు. పదికి రూపాంతరం పన్‌ అనడానికి అనేక ఆధారాలున్నవి. పన్నిద్దఱు [పన్‌ + ఇద్దఱు ] (SII 5.1298.8,1241) మొ.వి. ఆలాగే ఎనమండ్రు అనడానికి ప్రాచీనరూపం *ఎణ్-పన్‌-రు (> ఎణ్-మన్‌-ఱు> ఎనుమంఱు> ఎనమండ్రు) అనవచ్చు. ఒత్తుకాంఱు, వాస్యకాంఱ్రు శబ్ధాలకూ ఒత్తుకాన్‌-రు, వాస్యకాన్‌-రు రూపాలు ప్రాచీనరూపాలని చెప్పవచ్చు.
    న్ఱ>ణ్డృ మార్పు తెలుగులో ఎప్పుడు జరిగిందో చెప్పటానికి ఆధారాలు అంత స్పష్టంగా కనబడవు. అద్దంకిశాసనంలోనే పణ్డెండు శబ్ధం కనబట్టంచేత ఈమార్చు 8వ శతాబ్దికి పూర్వమే జరిగిఉండాలి. ఈయుగంలో కనిపించే తన్ఱి మొదలగురూపాలు బహుశా పామర మాండలికంలో (Substandard dialect) వ్వవహారంలో ఉండవచ్చు. విశాఖ ప్రాంతంలోని కొండభాషలో నేటికి –న్ఱ- ఉచ్చారణలో ఉండటం దీనికి ప్రబల తార్కాణ అవుతుంది.
    4.13. –యి- > - హి- : ఇకారం పరమౌతుండగా అపదాది యకారం హకారంగా మారడం ఈయుగంలో చాల తరచుగా సంభవిస్తుంది. ఉదా: నాహిండు