ఈ పుటను అచ్చుదిద్దలేదు
108
తెలుగు భాషా చరిత్ర
4.9. డ->ద-: పదాది డకారం దకారంగా మారడం, శాసనభాషలో 10వ శతాబ్దిలోనే ప్రారంభమమైనా, ఈ యుగంలో డకారాది రూపాలు చాలా వరకు నిల్చి ఉన్నాయి. డాయు (SII 5.134.7, 1132) ; డున్ను (EI 5.14.138, 1213), డిగ్గిలి ( SII 5.1214.26, 1309). దకారంగా మారిన రూపాలు చాల స్వల్పంగా కనిపిస్తున్నాయి. దుత్తిక(<డుత్తిక<ఱుత్తిక) (SII 10.364.14, 1259), దున్ను (NI 2.7, 1314).
4.10. త-> ట-: -ఎంక్-అనే వర్ణాలు పరమవుతుండగా, తకారం టకారంగా మారటం ఈ యుగంలో క్వాచిత్కంగా కనిపిస్తుంది.
తకార రూపాలు : తెంకాయ (SI1 5 1236.3, 1277 ), తెంకణ (ప. 6.628.118, 1224), నూతెక్కి (పై. 10.79.18 1118). టకారరూపం; నూట్టెంకి (పై. 10 142 4, 1158) మొ వి.
4.11. -ంఱు(-న్ఱు) -ండు(-:ణ్డు) : నకార, శకటరేఫల సంయుక్తం ణ్డగా మారడం ప్రాచీనశాసనాల్లో విరివిగా కనిపిస్తుంది. ఈ యుగంలో ఒక నెల్లూరుజిల్లాలో మాత్రం ణ్డగా మారనిరూపాలు రెండుసార్లు కనిపిస్తాయి. అందులో వ్రిత్తికాంఱు (NI 1.24.17, 1187) ప్రథమాంతం, వాన్రి పెద్దకొడుకు (NI 3.9.29, 1259) షష్ట్యంతం. ఈ రెండవదానిలో శకటరేఫకు బదులు రేఫే కనిపిస్తుంది.
పై రూపాలు వ్రాతలో మాత్రం నిల్చి ఉన్నాయా ? లేక ఉచ్చారణలోనూ నిల్చి ఉన్నాయా? మాండలికాల విషయంలో నెల్లూరుజిల్లా అనేక ప్రాచీనరూపాల్ని నిల్పుకొన్నట్లు చెప్పడానికి మనకు పెక్కు ఆధారాలున్నాయి. చేసిన, చేసిరి, అనడానికి బదులు 7వ శతాబ్దికి చెందిన భైరవకొండ (ఉదయగిరితాలూకా, నెల్లూరుజిల్లా) శాసనాల్లో కేసిన, కేసిరి అనే రూపాలున్నాయి. ఆంటే తెలుగుభాషలో తాలవ్యీకరణo అతి ప్రాచీనకాలంలోనే జరిగి పోయినా తాలవ్యీకరణం కాని రూపాలీ ప్రాంతంలో నిల్చి ఉన్నాయి. ఇవి కేవలం వ్రాతల్లోనే నిల్చి ఉన్నాయేమో అనడానికి వీల్లెదు. ఇటీవలి మాండలిక పరిశీలనలో నెల్లూరుప్రాంతాల్లో కింక, కీలిసె, కీడిసె వంటే తాలవ్యీకరణం కాని రూపాలు కనిపించాయి2. కాబట్టి వ్రిత్తికాన్ఱు వంటి రూపాలు బహుశా నెల్లూరు జిల్లాలో పామరమాండలికాల్లో (Substandard dialects) నిల్చి ఉండవచ్చు. అట్టివి క్వాచిత్క౦గా శాసనాల్లోకి వచ్చి ఉండవచ్చు.