ఈ పుటను అచ్చుదిద్దలేదు
శాసన భాషా పరిణామం
107
నికి ముందే ఒక్క విశాఖ-శ్రీకాకుళం ప్రాంతం తప్ప తక్కిన ప్రదేశాల్లో పూర్తయి ఉండాలి. కనక తక్కిన అన్నిచోట్ల చెల్లు అనే రూపం కనిపిస్తుంది. కాని విశాఖ-శ్రీకాకుళం ప్రాంతంలో చల్లు ( SII 6.719 31, 1278, 6.1129.12 1376) మొ-వి; చెల్లు (పై. 6,845.12, 1273, 6.911.8 1349) మొ. రూపాలూ కనిపిస్తున్నాయి.
4.7. ఋ > రి, ఋ > రు : ఋ సాధారణంగా శాసనభాషలో రి అవుతుంది, రిషభ (SII. 4.990.2, 1158) మొ.వి. కాని ఈ యుగంలో ఋ > రుగా మారడం కూడా క్వాచిత్కంగా చూడవచ్చు. పిత్రుస్థానము (SII 4.1248.9, 1112), ప్రుదివి (తె.శా. 1.62.9 1259, 1258), రుతు (SII 4.950.8, 1346) మొ.వి.
4.8. దీర్ఘాచ్చులు : (అ) యకారం పరమవుతుండగా పదాది ఎఏలు రెండూ పర్యాయంగా ఈయుగంలో కనిపిస్తాయి. ఉదా. వేయి ( SII. 10.671.12,1128), వెయి (పై. 5.1013.2, 1148). నేయి (పై. 10.206.11,1195), నెయి (పై. 5.1012.9, 1108) మొ.వి. శాసనాల్లో ప్రయోగాల సంఖ్యనుబట్టి చూస్తే వేయి రూపం వెయి రూపం కంటే అధికంగానూ, నెయిరూపం నేయిరూపం కంటే అధికంగానూ ఉన్నాయి. దీన్ని బట్టి వేయిరూపానికి దీర్ఘ పూర్వకమూ, నేయి రూపానికి హ్రస్వపూర్వకమూ ప్రాచీనమేమో అనిపిస్తుంది. మొత్తంపైన యకార పూర్వక హ్రస్వదీర్ఘ సమ్మేళనం (merger) ఈ యుగంలో సమగ్రంగా కనిపించటంచే ఈ సమ్మేళనం ఈ యుగానికి పూర్వమే ఎప్పుడో జరిగిందని చెప్పవచ్చు.
సమాసాల్లో హల్లు పరమైనప్పుడు యకారం కనిపించదు. పూర్వాచ్చు దీర్ఘ రూపంతోనే కనిపిస్తుంది. నేమాన (SII 4.1061.10, 1149), వేకై లలు (పై. 10.715.18, 1251).
(ఆ) 'ఈ’ అనే విశేషణం ఈ యుగంలో పరహల్లు దిత్వం కాకుండనే తరచుగా హ్రస్వరూపంతో ప్రయోగింపబడుతుంది. ఇదీపము (SII 5.160.15, 1136). ఇతోణ్ణపట్టు (పై. 4.1114.20, 1163) మొ.వి. వికాఖ-శ్రీకాకుళం ప్రాంతంలో హ్రస్వదీర్ఘాలు తరచుగా తారుమారౌతాయి. బహుశా ఇది ఒరియాభాష ప్రభావమై ఉంటుంది