ప్రాచీనాంధ్రం : శాసన భాషా పరిణామం
101
ఉండేదని, తెలుగుమీద మొదట ప్రాకృతప్రభావమూ తరవాత సంస్కృత ప్రభావమూ అధికంగా ఉండేవనీ అనుకొనేవారు. అత్యంత ప్రాఛీన శాసనకాలంనాటికే తెలుగు ప్రత్యేక భాషగా విలక్షణ నిర్మాణంతో ఉండేదని తెలుస్తుంది. భాష ఎప్పుడూ తనకు స్వతస్సిద్ధమయిన వ్యవస్థతోనే ఉంటుంది. ఆ వ్యవస్థను గుర్తించి వర్ణించటమే వ్యాకరణాల పని వ్యవస్థే లేనప్పుడు వర్ణన సాధ్యం కానేకాదు; వర్జన సాధ్యమైనప్పుడు ఆ వ్యవస్థ, ద్రవస్థితి అనే మాటలకు అర్ధమేలేదు. రాజాదుల ఆజ్ఞలు కొన్ని తెలుగులో ఉన్నంతమాత్రాన తెలుగు రాజభాషగా ఉండేదని చెప్పలేము. పరిపాలన సౌలభ్యంకోసం గాని, తమ దానధర్మాదులను తమను ప్రస్తుతించుకోటానికి గాని తెలుగులో శాసనాలువేసి ఉంటారు. ఇప్పటి అధికారభాష ఆంగ్లమైనా సామాన్య ప్రజలకు తెలియవలసిన విషయాలను ప్రభుత్వం తెలుగులో ప్రకటించటానికి ఆనాటి పరిస్థితికి భేదంలేదు. అలాగే ప్రాకృత ప్రభావం తొలిదశ లో ఎక్కువగా ఉన్నదనటానికి గూడా ఆధారాలు దొరకలేదు.
3.81. ప్రాగాంధ్రదశ : దొరికిన శాసనాల్లో అత్యంత ప్రాచీనమైన దాని కాలంనాటికే తెలుగులో కొన్ని ప్రధాన పరిణామాలు జరిగేయి. ధాతువుకూ ప్రత్యయాలకూ మధ్య అచ్చులు చేరటం. వర్ణవ్యత్యయ అచ్సంకోచాలవల్ల పదాదిని సరళాలూ సంయుక్తాక్షరాలు ఏర్పడటం, వర్జసమీకరణంవల్ల పరుషాలు ద్విరుక్తం కావటం, తాలవ్యీకరణంవల్ల కకారం చకారం కావటం వంటివి కొన్ని ప్రధాన పరిణామాలు.
3.82. ప్రాక్సాహిత్యదశ : చరిత్రకాలంలో జరిగిన మార్పులను బట్టి క్రీ. పూ. 200- క్రీ. శ. 1100 మధ్యనున్న తెలుగుభాషాచరిత్రను మూడుదశలుగా విభజించవచ్చు మొదటిది. క్రీ. పూ. 200- క్రీ. శ. 6 శతాబ్ధుల మధ్యదశ; దీని ప్రాక్సాహిత్యదశ అనవచ్చు. ఈకాలంలో ఱకారం ప్రత్యేకవర్ణంగా ఉండేది. రేఫఱకారాలు ఓకే వర్ణంగా మిళితం కావటం మధ్యాంధ్రదేశంలో ఆరంభమయింది. దేశీయమైన పరసవర్ణాదేశానికి బదులు అనుస్వారాన్ని ఉపయోగించి లేఖనపద్ధతిని సులభీకరించటం మొదలయింది. పదాంతసంధి ఉండేదికాదు. పదమధ్యసంధులు మొదలైనాయి. గసడదవాదేశం వైకల్పికంగా ఉండేది. మొత్తంమీద తరవాతి కాలంలోని భాషకు నిరూపకమైన విలక్షణనిర్మాణక్రమం, ప్రత్యేకభాషాక్రమం ఏర్పడ్డాయి. సంస్కృతసంపర్కం, ప్రభావం బాగా ఉండేవి.
3.83. సాహిత్యదశ : క్రీ. శ. 7-9 శతాబ్దుల మధ్యకాలంలో తెలుగుభాషలో సాహిత్యదశ ఆరంభమయింది. వ్యావహారిక సాహిత్య మాండలికాలు