ఈ పుటను అచ్చుదిద్దలేదు
100
తెలుగు భాషా చరిత్ర
లేకున్న వేణ్ణికొణ్డుమ్ (33-34), పరోపకారంబుపొణ్డె నా నీ కొరవి యన్నది... (35-36).
3.77. మణిప్రవాళశైలి : సంస్కృతాంధ్ర పదబంధాల్ని మేళవించి వాక్యరచన చేయటానికి 'మణిప్రవాళశైలి' అని పేరు. పాల్కుర్కి సోమనాథుడి కాలం నుంచి తెలుగు సాహిత్యంలో ఈపద్ధతి విరళంగానే కనిపిస్తుండేది. శాసనాల్లో క్రీ. శ. ఏడో శతాబ్దినుంచి ఈరకం వాక్యాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఉదా. క్షేత్రం ఖణ్డుగవడ్ల సహితమ్ ( EI 10. 100-8.28, 674 ), ... ఏఱువ విషయం బేళన్ తస్య మాతాదత్తం ... శతపంచాశత్ క్షేత్రమ్ (పై. 29.160-64. 8-9,680); రేవశమ్మ౯స్య గుడి (SII 10.603.2-8); ... కొడుకు పల్లవా చార్జ్యస్య లికితం ( EI 27.203-6.24-26, 850 ); కొఱ్ఱబోయు తటాక౭ (పై. 9.47.59,945-46).
3.78. పృథక్కరణం : జాతి ద్రవ్యాదుల్ని పృథక్కరించి చెప్పటానికి సప్తమీవిభక్తి ప్రత్యయాన్నో, అనుబంధాన్నో వాడటం చాలా ప్రాచీన కాలంనుంచి వాడుకలో ఉంది. ఉదా. శ్రీ సోఱమహారాజు ల్లొళన ఇన్సుఱోలి అణపోతులు (వ్యాా. నం. 301-10.1-2, 600-25); బాదిరాజుల అన్దు పళ్ళెయరి కొడుకు (EI 27.203-6.6-8, 850).
3.79. కాలస్థల నిర్జేశం : 'ఉండు' ధాతువు క్త్వార్ధకరూపంతో ఆరంభదశను, చతుర్ధీ ప్రత్యయంతో అంతిమదశనూ నిరూపిస్తూ కాలస్థలనిర్దేశం చేయటం అనాదిసిద్ధంగా ఉంది. ఉదా. ఒంగోడునుండి ఱిగదేబుపళ (i)కు పోవు పన్థా (భారతి 1.139-36.16-17,696-709); చేబ్రోలనుండి బెజవాడ జాత్రకు వచ్చి (శా. ప. మం. 1.2-3.22-23, 899-934). ఈక్త్యార్ధకరూపం కాలక్రమాన 'నుంచి'గా మారి నేటి వాడుకలోకి వచ్చింది.
3.80 ఉపసంహారం : శాసనైకాధారమయిన ప్రాచీనాంధ్రభాషను శాస్త్రీయపద్ధతుల్లో పరిశీలించినప్పుడు ఇంతకాలంగా లోకంలో ప్రామాణికవాక్యాలుగా చెలామణి అవుతున్న కొన్ని దుర్భమలు తొలిగిపోతాయి. నన్నయ్యకు ముందు తెలుగుభాష 'ద్రవస్థితి'లో ఉండేదనీ (సోమయాజి 1948; 36,143.233, 234), దాన్ని అతడు సంస్కరించి 'ప్రమాణీకరించా'డనీ ( పై. 98,148-55,203-29,235), చాణుక్యులకాలంలో తెలుగు 'రాజభాష'గా 'అధికారభాష'గా