Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం

99

   3.75. కర్మణి ప్రయోగము : సంస్కృత భాషాప్రభావంవల్ల తెలుగులోకి వచ్చిన కర్మణి  ప్రయోగంగల వాక్యాలు మూడుమాత్రమే క్రీ. శ. తొమ్మిది శతాబ్ది నుంచి దొరుకుతున్నాయి. ఉదా. పట్టం కట్టబడిన వాన్ఱు (పై. 10.629.5-6, 625); అతని చేయంబడిన ధమ్ము౯వుల (తె. శా. 1.163-65,55-56, 892-922); వైదుంబుళచేతం బట్టం కట్టబడి యేలి (SII 10. 640 4-5,9/10).
   3.76. పదబంధాలు : కావ్యభాషలో కనిపించేరకం పదబంధాలు శాసనాల్లో కొన్ని కనిపిస్తాయి. ఉదా. విడిచిన బసిణ్డి నూఱు గద్యాణంబులు (JAHC 3,16-21.14-16, 678); ప్రసాదచేసిరి (EI 27-236-38.12-13, 700-25 ); సురలోకంబేజ్గె (SII 10.639.10, 825); సుఖంబుణ్డి (తె. శా. 1.163-65.23-24, 892-922 ); సుఖంబుమనువారు (పై. 68),అతని కొఱ్పించిన చెఱువులు (పై. 53-54); అతనిచేయంబడిన ధమ్ము౯వులు (పై. 55. 56), నీ చేసిన యుపకారంబునకుం (పై. 27-29); చలిపందిరిచేసె (SII 6.586.8-9, 1074); చెఱువునుం గుడియించి సేయించె (పె.7); తమ ప్రతిష్టసేసిన ... ఈశ్వరాలయంబునకు (పై. 10.644.66-70, 1060); తను వేయించిన...తటాకంబున (పై. 61-65); విజయదిత్య దేవరత్తించిన... మణ్డపము (పై. 11.8-11, 1089) వెలకుం గొనివిడిచిన యిల్లు (పై. 651,13, 1090-91).
  పోలిక : 'పోలు' ధాతురూపాలతో పోలికను చెప్పేవారు. ఉదా. ఈశ్వరునకుం గాత్తి౯ కేయుణ్డుం బోలె (భారతి 5.618.3, 850); బెజయితదేవని కూంతు సరియ పోల్పం గాంత లెందు (RPS 28-29 11,1065), భూమిదేవిం బోల్‌ రేవలదేవికనిన సోమలదేవి (పై. 4-4). దొరికిన ఈ మూడు ప్రయోగాలూ పద్యశాసనాల్లోవే.
  సంవాదం : ఆంగ్లంలోలాగా తెలుగులో ప్రత్యక్షపరోక్ష సంవాద పద్ధతిలేదు. సంవాద పద్ధతి ఉందిగాని ఇందువల్ల క్రియారూపాదుల్లో ఏవిధమైన మార్చురాదు. ఒక్కకొరవి శాసనంలో మాత్రమే (తె. శా. 1.]163-65..... 892-922) సంవాదవాక్యలు లభించాయి. ఉదా. నీవు నా ప్రాణసమానుణ్డవైన చెలివి (26-27), నీచేసిన యుపకారంబునకుం బ్రత్యుపకారంబు చేయవలయుం (27-30), నీకేమి వలయుం దాని వేణ్డికొమ్మ్‌ (30-32): నీ శ్రీ నాకెల్లం గలద్‌ (32-33), ఏమి