ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప్రాచీనాంధ్రం : శాసన భాషాపరిణామం
97
తెలుగులోకి వచ్చిన యత్తదర్థక కర్మణ్యర్థక ప్రయోగాలు చాలా విరళంగా ఉండేవి. ఈ సాధారణ పదవిన్యాస క్రమానికి విరుద్ధమైన ప్రయోగాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి.
3.71. క్రియాభ్యాసం : ప్రాచీనాంధ్రంలో మొట్టమొదట నామాఖ్యానమే గాని క్రియాఖ్యానం లేనేలేదని ఒక నమ్మకముంది (సోమయాజి 1948;143,144,150). అలాంటి క్రియాశూన్యత లేదని నిరూపించటానికే ఎక్కువ నిదర్శనలు లభిస్తాయి. నిజానికి ఇందుకు కావలసిన ఉదాహరణలన్నిటినీ ఇవ్వాలంటే శాసనాలన్నిటినీ ఎత్తి రాయాల్సి వుంటుంది. మచ్చుకు క్రీ. శ. ఏడోశతాబ్ది శాసనాలనుంచి కొన్ని మాత్రం రాస్తాం : బోళచేత శవణ గొణిరి (ఆం. ప. 1941-42,2,600-25), విషయబోళ కొజిలి (వై. క, కమ్మరి వినియణ వ్రాసె (SII 10.599 21-22, 625-50), కుమారశమ్మా౯రికి ఉదకపూవ్వ౯జ్కేసి ఇచ్చిరి (EI 30.69-71.5, 689-700 ), కఞ్చగార్లు కొట్టిరి (పై. 8), గొరవళ్
మెచ్చిచే నిచ్చిరి (NI. 3. 1152-55.35-36,7). ప్రథమపురుష బహువచనం, మధ్యమ పురుష బహువచనం, ప్రథమపురుమైక వచనం, ఉత్తమ పురుష బహువచనం, మథ్యమపురుషైక వచనం అనే దిగుడు వరసలో సమాపక క్రియలున్న పూర్ణ వాక్యాలు శాసనాల్లో కనిపిస్తాయి.
3.72. నామాభ్యాసం : క్రియాభ్యాసం కన్న విరళంగా నామాభ్యాసం కనిపిస్తుంది. ఇది మూడు విధాలు. (1) క్రియాపదరహితం : ఉదా. ఇన్దోఱు దీనికి సక్షి (ఆం. ప. 1941-42.4-5,600-25), పెగ్గడ మేడ వ్రాలు (SII 6.250.7, 742-98), దీని అరి నల్తుముడ్లు (AR 233/1949-50.9, 8).
(ii) ధాతుజ విశేషణయుక్తం : ఉదా. కుణ్డికాళ్ళుళ ఇచ్చిన పన్నస ఇరవదియది నాల్కు మఱున్తుఱ్లు నేల (EI 27.225-28.11.14,575-600), లోకమ నిల్పిన స్తానంబు (SII 10.56.2-3, 7 ). (iii) సార్వనామిక విశేష్యయుక్తం : ఉదా. నీవు నా ప్రాణసామానుణ్డవైన చెలివి (తె. శా. 1.163-65,26.27, 792.922).
3.78. విలక్షణవాక్యరచన : ఇంతకు ముందు చెప్పిన సాధారణలక్షణాలు పూర్తిగా సరిపడని పదవిన్యాసక్రమం 9 రకాలుగా కనిపిస్తుంది. (i) కర్తలేనివి: ఉదా. వానపోతుల ముచ్చియకు ... ఇచ్చిరి ... నేల ( SII 10.598,
(7}