ఈ పుటను అచ్చుదిద్దలేదు
96
తెలుగు భాషా చరిత్ర
3.69. మిశ్రపదాలు : క్రీ. శ. ఏడో శతాబ్దినుంచి 'మిశ్ర సమాసా'లని, 'వైరిపదా' లని, చెప్పబడే మిశ్రపదాలు లభిస్తూనే ఉన్నాయి. వ్యాకరణాలు నిషేధించినా ఈ పరిస్థితిలో మార్పులేదు. తత్సమ దేశ్యాలతో ఏర్పడ్డ మిశ్రపదాలు సంఖ్యాధికంగా ఉండేవి, తద్భవదేశ్యాలు కలిసిన పైవాటికన్నా సగానికి సగం తక్కువగా ఉండేవి. అయితే ఈ పదమిశ్రణం కావ్యభాషలోనూ పద్యశాసనాల్లోనూ అత్యల్పం; గద్యశాసనాల్లో అత్యధికం ఇది నాలుగు రకాలు. ఉదా. (i) దేశ్యతద్భవ మిశ్రణం; కణ్డసామి (EI 31.74-80.36,669), గొల్లపల్లు (SII 4.1016.2, 1087), మావ్వ౯లగరుడణ్డు (రా. ప. సం. 187-89.7-8,1018), మొగమాడువ్ (శా. ప. మం. 1.2-3 42, 898-934). (ii) దేశ్యతత్సమ మిశ్రణం : అమృతపడి (NI 8. 1072.17,1088), గణ్డభైరవ (SII 10.647.23-24, 1097), జయమాడ (పై. 6.109. 29,1076), పోర్ముఖరామ (పై. 10.599, 1-2, 625-50), మానవత్తి౯క (భారతి 3.33 -94.45,1060). (iii) తత్సమ తద్భవ మిశ్రణం : ఉదారబుద్ధి (SII 10.638.3,9/ 10), ఘనరాచమణి (NI 3.1152-55.20-30,7) చౌషష్టి (భారతి 5. 618.3,850), లోవా దణ్జు (SII 4.1161.5, 1072), సవ్వ౯బాద పరియారువు (రా. ప. సం. 71-72 19-20,847), (iv) దేశ్య తత్సమ తద్భవ మిశ్రణం : వేణవోజన్ఱు (EI 240-42.18-20, 725), దేవొనొజ్ఞలకూ (JAHRS 1.81-85.4,10).
3.70. పదవిన్యాసక్రమం : ఉచ్చారణపద్ధతి, విరామం, స్వరం మొదలైనవి శాసనకాలంలో ఏవిధంగా ఉండేవో సరిగా తెలీదు కాబట్టి ఆనాటివాక్య నిర్మాణాన్ని గురించి విపులంగా చెప్పటం సాధ్యం కాదు. అయితే లేఖనంలోని పునరావృత రేఖలను బట్టి వాక్యాల ఆద్యంతాలను గుర్తించి వాటి నిర్మాణంలో కనిపించే కొన్ని ప్రత్యేకలక్షణాలను వివరించవచ్చు. ఉద్ధేశ్య విధేయపూర్వక వాక్యరచన సాధారణంగా ఉండేవి. కానీ అక్కడక్కడ ఆ క్రమం మారేది. కర్త సాధారణంగా ప్రథమావిభక్తిలో ఉండేది. కర్మ ప్రాణివాచకమయితే ద్వితీయా చతుర్ధుల్లో ఏదో ఒక దాంట్లోను, జడవాచక మయితే ప్రథమలోను ఉండేది. విధేయం ఉద్ధేశానికి ముందు, అవ్యయం క్రియకు మునుపు, విశేషణం విశేష్యానికి పూర్వాన, పరోక్షకర్మ ప్రత్యక్షకర్మకు వెనకా సాధారణంగా ఉండేవి. నామాఖ్యాన క్రియాఖ్యాన పద్ధతులు రెండూ ఉండేవి. కొన్ని సమయాల్లో ధాతుజవిశేవణాలను కూడా వాడని నామాఖ్యాన పద్ధతి కనిపిస్తుంది, సంస్కృత సాహితీ ప్రభావంవల్ల