Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

92

తెలుగుభాషా చరిత్ర

(AR 76/1956-57.10, 1086). ఇప్పటి-'కాడు/-గాడు'లకు ఇది పూర్వరూపం. దీని ప్రాచీనరూపం*కాన్ఱ్ అయి వుంటుంది. హల్పూర్వానునాసిక లోపాన్ని బట్టి ఇది కన్నడం నుంచి వచ్చిన ఎరువుమాట కావాలి. (v) 'చేసేవాడు' అనే అర్థంలోనే '-గార్‌' ప్రత్యయం వచ్చేది. కఞ్చ-గార్‌-లు (EI. 30.69.71 8,699_700). 'కాంస్యకార' శబ్ధభవమైన ఈశబ్ద౦లోని ప్రత్యయం కూడా ఆర్యభాషా భవమనే చెప్పాలి. కాఱు, కారుల” లోని రేఫభేదం ఇందుకు మంచి ఉపపత్తి. (vi) బహుశా దిగర్ధంలో “-పల” ప్రత్యయం వచ్చి వుండవచ్చు, లోపు ఉదా. (SII 10. 651.13, 1090-91). లో-పల్‌-ఇ (త్రిలింగ రజతోత్సవ సంచిక352-64.17,991), డా-పల వెల-పలవంటి మాటల్లో పోల్చి ఈ ప్రత్యయాన్ని వ్యాకరించటం జరిగింది (viii) 'స్వార్థం'లోనే 'ఱు' అనే ఆపదాంశం ఒకటి కనిపిస్తుంది. ఉదా. పొద-ఱు (EI 6.347-61.90, 1011) పొదశబ్దంతో ఈ ప్రత్యయంవల్ల వచ్చిన అర్థవిశేషమేమీ లేదు. బహుశా 'కూతు, కూతుఱు' శబ్దాలు కూడా ఇలాంటివేనేమో.

    3.65. కృత్ప్రత్యయాలు : శాసనాల్లోదొరికే క్రియాపదాలతో మాత్రమే పోల్చి చూస్తే క్రియాధాతువునుంచి విశేష్యాలను తయారుచేసే కృత్ప్రత్యయాలు ఏడు లభిస్తున్నాయి. ఉదా. కూట్‌-అము-న (AR 75/1956-57.16, 1080), వాడ్‌- ఇక-లు (పై. 16-17). డిగ్గ్-ఇలి (SII 5.1058.6, 1084), తో-ట-ళు (పై. 10,599.11, 625 50). నంజు-డ్‌-లు. (పై. 4,1015.9,1084). తూఱ్-పు

(భారతి 5.935-48.11, 675), కొల్‌-వు-నన్‌. (పై. 618-6, 897). ఈ ప్రత్యయం వర్ణనాత్మకంగా వినిమాయక సపదాంశ౦. కాపళుు(NI 2.606-7.7,8) వంటి చోట్ల ధాత్వంత చకారస్థానంలొ వచ్చే పకారం కూడా వర్ణనాత్మకంగా వినిమాయక సపదాంశమే అయినా తులనాత్మకంగా కేవలం ఆదేశమే ఈ ప్రత్యయానికి ముందు మకారం ఆదేశం కావటం బహువిరళమైనా ఒక విశిష్టలక్షణమే.

    3.66. స్థలనామ ప్రత్యయాలు : శాసనాల్లో దొరికిన భిన్న స్థల నామాలను మాత్రమే పొల్చి చూసినప్పుడు ప్రముఖంగా 44 రకాల స్థలనమప్రత్యయాలు లభిస్తున్నాయి. ఆయా ప్రత్యయాలకున్న సపదాంశాలను వివరించకుండా (గ్రంథ విస్తరభీతి తప్పదు కాబట్టి) ప్రకృతి ప్రత్యయ నిర్దేశ౦చేస్తూ ఒక్కొక్క ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాము: ఉదా. వుద్‌-అలి (EI 27,244-51 2,725-75), మ్లావ్‌-ఇండి (SII 6 584.4, 641), ఆత్త్-ఇలి (భారతి 12.86-96.13,709