ఈ పుటను అచ్చుదిద్దలేదు
90
తెలుగు భాషా చరిత్ర
65.71-72, 892 922). పోదు-రు (AR 390/1932-33.39, 1081), పోవుదు-రు పై. 18-19). 'కొణ్డు'లోని శకటరేఫ సంధికారణంగా ఏర్పడ్డది. అప్రాణివాచక బహువచన రూపం ఒకటి మాత్రమే దొరికింది. ఉదా. ఇచ్చిన-వి (SII 10.12.9, 1087).
3.61. ఏవార్ధకం : ఏవార్థకంగా -అప్రత్యయం మాత్రమే కనిపిస్తుంది. ఉదా. పాఱక్-అ (AR 392/1904.9-10, 575-600), చిర్పలి-య (EI 27.231-34.5, 625-50 ). అజంత ప్రాతిపదికమీద యడాగమం రావటం గమనార్హం. ఈ ప్రత్యయాన్ని పునరుక్తంగా ప్రయోగించటం కూడా అత్యంత విరళంగా ఉండేది. ఉదా. తాన్-ఆ-య (తె.శా. 1.163-65.42,882-922), ఈ లక్షణం కావ్యభాషలోనే నిలిచింది.
3.62. సందేహాద్యర్ధకం : అనిశ్చయ, సందేహార్థాలను సూచించే ప్రత్యయం -'(య్) ఏని(యు/న్)'. ఉదా. కలర్-ఏనియు (పై. 72-73), ఎవ్వి-యేనిన్ (పై. 54-55), ఎవ్వాండి-ఏని (SII 10.4.12,1008). -ఏని ద్రుతమా కళా అనే విషయం మీద సంప్రదాయపండితులు తీవ్రచర్చలు జరిపారు. (బా. వ్యా. 2.9;8.41,119; సోమయాజి 1948, పే. 307, 491, 552-54). క్రీ. శ. 9/10 శతాబ్దినాటి ఒకేశాసనంలో రెండురకాల రూపాలూ కనిపిస్తున్నాయి (చూ.పై.). ద్రుతరహితరూపమే ప్రాచీనమైనది. అనుచిత విభాగంవల్ల దీనికే 'నేని' అనే రూపాంతరం కలిగిందని (సోమయాజి, 1948, 307), వాస్తవానికి 'నేని' అనేదే మొదటిరూపమని పండితులు నిర్ణయించుకొని కొన్ని సమయాల్లో పురాతన కావ్యప్రయోగాలను కూడా దిద్దివేశారు. కాని 'నేని' అని వ్యాకరించదగ్గ సందర్భమేదీ శాసనభాషలో తటస్థ పడలేదు.
3.63. సముచ్చయం : సముచ్చయార్థక పదాంశం శాసనభాషలో విశేష్యాలమీద, క్రియలమీద, సందేహాద్యర్థక ప్రత్యయంమీద, సముచ్చయార్థాన్నే ఇచ్చే అవ్యయంమీద కూడా బహురూపాలతో వస్తుంది. ఉదా. (i) విశేష్యాలమీద : అన్నియు- (పై. 6.585.4, 633-63), కళాకణ్ణుగ్-ఉమ్ (పై. 584.9-10.641), గళ్ళు-వు (NI 3.1152-55), నాలు-సు (AR 182/1933-34, pt JI p. 41.2-3,7) (భారతి 1948, 270-90 369-75.65-66, 892-922) గుడి-యిని (EI 30.280-84.6, 972), గుడి-యింని (SII