పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాచీనాంధ్రం : శాసన భాషాపరిణామం

89

ఉదా కోణ్‌-మ్‌ (తె. శా. 1.163-65.34, 892-922), ఇచ్చితి-మి (SII 10.10.12, 1078), పరిహరించ్చితి-మి (పై. 651.15-16, 1091-92), '-మి/-ము'ల ప్రత్యయాంతాచ్చుతో వ్యవస్థితమై ఉంటుంది; -ఇతి- తరవాత -మి గాను, -డు-/-*దు-ల తరవాత -ము- గాను కనిపిస్తుంది.

     3.59. మధ్యుమపురుష : ప్రార్థనార్థక క్రియరూపాల్లో  మాత్రమే మధ్యమ పురుష ఏకవచన ప్రత్యయం లభించింది. ఉదా. కొమ్‌-మ్‌ (తె.శా. 1.163-65.32, 892,922), పో-మ్‌ (NI 1,245.5, 10), బహువచనరూపం ఒక్కటే దొరికింది. ఉదా.  ఇచ్చితి-రి (AR 233/1949-50.8,8).
    3.60. ప్రథమపురుష : లింగభేదంమీద ఆధారపడి ప్రథమపురుషలో భిన్న ప్రత్యయాలు కనిపిస్తాయి. ఏకవచనంలో మహదమహద్భేదంతోనూ బహువచనంలో ప్రాణివాచక అప్రాణివాచక భేదంతోనూ పురుషభేదక ప్రత్యయాలు దొరుకుతున్నాయి. విశేష్యాల్లో కనిపించే ఈఅన్వయం క్రియల్లోకూడా కనిపిస్తుంది. మహాదేకవచనంలో -(ఆ)ణ్డు అనే పదాంశం కనిపిస్తుంది. ఉదా. కల-ణ్డు (త్రిలింగ రజతోత్సవ సంచిక 352-64.31, 991), ఇచ్చిన్‌-ఆణ్డు (AR 77/1356-57, 14-15, 1096). వీటిలోని రెండోరూపం కావ్యభాషలో క్రీ.శ. పదమూడో శతాబ్ది నుంచి మాత్రమే కనిపిస్తుంది. *ఇచ్చినవాణ్డు నుంచి ఈరూపం ఏర్పడటం క్రీ. శ. పదకొండో శతాబ్దిలో గోదావరీ మండలంలో ఆరంభమైనట్లు తోస్తుంది. అమదేహకవచనంలో '-అది, -అదు -దు' అనే సపదాంశాలు కనిపిస్తున్నాయి. ఉదా. ఇచ్చిన్‌-అది (SII 10.599.16 625-50 ), చన్‌-ఆదు ( 1.163-65.71, 892-922), లే-దు (EI 30.280-84.13, 972), క-యది (SII 10.647.38, 1097). ఇకారత సపదాంశం  వ్యతిరేకక్రియల్లోను,  ఉకారయుతం తద్ధర్మవిశేషణాల్లోను రిపూరక ప్రవృత్తిలో ఉన్నాయి. ఆజంత ప్రాతిపదికమీది త్యయాద్యచ్చు నిత్యంగా లోస్తుంది. ప్రాతిపదికాంతంలోని అచ్చు తరవాత యడాగమం (కావ్యభాషలో లాగా) రావడంకూడా కద్దు.
     మహన్మహతీవచనంలోని '-రి/-రు' అనీ సపదాంశాలు పరిపూరక ప్రవృత్తిలో ఉన్నాయి. ప్రాతిపదిక చివరి ఇకారం తరవాత -రి ఇతరత్రా -రు పురుష ప్రత్యయాలుగా కనిపిస్తాయి. ఉదా. కేసి-రి (పై. 47.2.7) కొణ్డ్-ఱు (పై. 633.4,8), తాగి-రి (EI 337-47.19, 725), కల-ర్‌ (తె. శా. 1.163-