పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

88

తెలుగు భాషా చరిత్ర

    3.55. వ్యతిరేకార్థక క్రియారూపాలు : తద్ధర్మార్థక సమాపక క్రియకు వ్యతిరేకరూపం ధాతువుమీద -(ఆ)దు అనే ప్రత్యయాన్ని చేర్చటంవల్ల ఏర్పడేది. ప్రత్యయాది అకారం హలంతధాతువులమీద నిలిచి అజంతధాతువులమీద నిత్యంగా లోపించేది. ఉదా. చన్‌-ఆదు (తె. శా. 1.163-65,71, 892-922), లే-దు (EI 30. 280-84.13, 972). ధాతువుకు -(అ)ని ప్రత్యయంచేరగా వ్యతిరేకార్థక విశేషణాలు ఏర్పడేవి. ఉదా. పెట్‌-అని (*పెట్టని-కి బదులు తప్పుగా, SII 10.633 2-3,8), లే-ని (భారతి 5.792,10,848-49). వ్యతిరేకక్త్వార్థక క్రియలు ధాతువుకు -(అ)క ప్రత్యయంచేరి ఏర్పడేవి. ఉదా. ఓప్-అక (తె. శా. 1.163-65.74, 892-922). లే-క్‌ (పై. 3-4). పై మూడురకాల వ్యతిరేకక్రియల్లోనూ ప్రత్యయాది అకారం హలంత ధాతువుల తరవాత నిలిచి అజంతాల మీద నిత్యంగా లోపించేది. ఈ లక్షణం సపదాంశాల పరిపూరక ప్రవృత్తికి చిహ్మమేగాని ప్రత్యయాద్యకారం వ్యతిరేకార్థకంకాదని సూచించదు. అయితే సంప్రదాయ వ్యాకర్తలు (బా. వ్యా. 8.32,37; 39:47; ముఖ్యంగా 20) ఈ అకారాన్ని ఎందుచేతనో అలా భావించలేదు.
    3.56. వర్తమానక్రియ : శత్రర్థక క్రియలకు ఉండు ధాతురూపాలను చేర్చి వర్తమాన క్రియలను డొంకతిరుగుడుగా నిర్మించేవారు. ఉదా. ఏళుచ్‌-ఉన్ఱి (EI 11.337--47. 9, 725), చేయుచ్‌ - ఉన్న (తె. శా. 1.163-65.15-16,892-922), వాద్ది౯లుచున్‌-ఉణ్డు (*వర్ధిలుచుండు-కు బదులు తప్పుగా, త్రిలింగ రజతోత్సవ సంచిక 352-64.23, 991). 
     3.57. భవిష్యత్క్రియ : ధాతువు తుమర్థక రూపాన్ని ప్రాతిపదికగా తీసుకొని దానిమీద అసంపూర్ణక్రియ అయిన 'కల'ను చేర్చి భవిష్యత్కాల క్రియలను డొంకతిరుగుడుగా నిర్మించేవారు. ధాతుగత ద్రుతం తరవాత 'కల'నిత్యంగా 'గల'గా మారేది. ఈరకం క్రియలు క్రీ. శ. పదకొండో శతాబ్ది శాసనాల్లో మాత్రమే లభించాయి. ఉదా. ఓయం-గల (SII 4,1009.8-9,1092), పొయ్య-గల (పై. 5.71 8-9, 1099), ప్రతిపాలింపం-గల ( పై. 6.109.17, 1076). 'కల' స్వతంత్ర క్రియగాకూడా శాసనాల్లో కనిపిస్తుంది. ఉదా. కల-యంతకును (EI 4.314-22, 1075-76).
    3.58. ఉత్తమ పురుష : ఉత్తమపురుష ఏకవచన క్రియలు శాసనాల్లో లభ్యపడలేదు. '-మి/-ము' అనే సపదాంశాలతోటి బహువచనరూపాలు దొరికాయి.