Jump to content

పుట:తెలుగు కార్టున్.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. వాడిన భాషను బట్టి

a) వ్యాఖ్య సహిత (Captioned)
b) వ్యాఖ్య రహిత, నిశ్శబ్ద (Captionless silent)

2. నైపుణ్యాన్ని బట్టి

a) 2-డైమన్షన్ కార్టూన్
b) 3-డైమన్షన్ కార్టూన్

3) వస్తువులను బట్టి

a) కామెంటరీ కార్టూన్
b) రాజకీయ కార్టూన్లు
c) సామాజిక
d) సందర్భోచిత, విషయగత (Thematic)
e) ప్రముఖుల చిత్రాల (Portraiyal)
f) క్రీడా కార్టూన్లు

4) విషయాన్ని బట్టి

a) సాంస్కృతిక సహిత (Culture centred)
b) సాంకేతికేతర (Culture free)

5) కొనసాగింపు తీరు

a) సీరీస్ (Serial Cartoons)
b) విడివిడి కార్టూన్లు

6) చిత్రించే తీరు

a) సంకేతాత్మక (Symbolic)
b) సన్నివేశాత్మక (Situational)

7) మాధ్యమాన్ని బట్టి

a) స్థిర, నిశ్చల కార్టూన్ (Print media)
b) చలనచిత్ర (Electronic media) - యానిమేషన్ కార్టూన్లు

8) క్యారెక్టర్ని బట్టి

a) ప్రధాన పాత్ర
b) జంతుపాత్రల ద్వారా చెప్పే కార్టూన్లు (Anthropomorphic - Animal Cartoon) ఉదా|| మిక్కీమౌస్, డోనాల్ట్ డక్.

ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కార్టూన్లను లోతుగా పరిశీలిస్తే పైన చెప్పిన విషయాలు సులభంగా అర్థం అవుతాయి. వాల్ట్ డిస్నీ 'గార్ఫేల్డ్' కార్టూన్లు ('పిల్లి' ప్రధానపాత్ర), 'డెన్నిస్ ది మినేస్' (హాన్ కె చామ్ కార్టూనిస్ట్), కామన్ మ్యాన్ (ఆర్.కె.లక్ష్మణ్ కార్టూనిస్ట్), 'పీనట్స్' (ఛార్లెస్ ఎం. షుల్జ్) కార్టూన్లు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయి. ఇవేకాక, ఆయా సందర్భాలను అనుసరించి ఏకవస్తువుగా వచ్చే కార్టూన్లు కూడా ప్రసిద్దమే! పర్యావరణ అంశాలు, అక్షరాస్యత, బాలికా సంరక్షణ, గృహహింస, శాంతి, యుద్ధ నివారణ వంటి అంశాలు ఆధారంగా వచ్చిన కార్టూన్లను Thematic Cartoon గా పిలుస్తాం.

శాశ్వత పరిశోధనా కేంద్రాలూ ఉన్నాయ్:

రోజు రోజుకూ కార్టూన్లకు ప్రజలలో పెరుగుతున్న ఆదరణను గమనించిన కొన్ని విశ్వవిద్యాలయాలు, సంస్థలు, వ్యక్తులు కార్టూన్ల కోసం ప్రత్యేక లైబ్రరీలను, పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి పరిణామం. ఈ ధోరణికి శ్రీకారం చుట్టిన సంస్థ - "బిల్లీ ఐర్లాండ్ కార్టూన్ లైబ్రరీ అండ్ మ్యూజియం"! ఓహియో స్టేట్ యూనివర్శిటీకి అనుబంధంగా 1977లో అమెరికాలోని కొలంబస్లో ఏర్పాటైన ఈ పరిశోధనా సంస్థ పూర్తిగా కార్టూన్లకే అంకితమైన కేంద్రం. దీనిలో ఇప్పటికే 4.5 లక్షల ఒరిజినల్ కార్టూన్స్, 36వేలకు పైగా కార్టూన్ పుస్తకాలు, 51వేలకు పైగా కార్టూన్ సీరియల్ టైటిల్స్, 25 లక్షలకు పైగా కామిక్ క్లిప్పింగ్స్ భద్రపరచబడ్డాయి.

అలాగే బ్రస్సెల్స్ నగరంలో (బెల్జియం దేశం) 1989లో 'బెల్జియన్ సెంటర్ ఫర్ కామిక్ స్ట్రిప్ ఆర్ట్' పేరుతో కార్టూన్ల కళా పరిశోధనా సంస్థ ఏర్పడింది. బ్రిటన్లో ఉన్న కార్టూనిస్ట్ల కోసం లండన్లో 2006లో "ది కార్టూన్ మ్యూజియం" పేరిట ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, అమెరికాలోని పిట్స్బర్గ్ “టూన్యమ్” పేరుతో “పిట్స్బర్గ్ మ్యూజియం ఆఫ్ కార్టూన్ ఆర్ట్'ని 2007లో నెలకొల్పారు.

ఇవన్నీ ఆయా కార్టూనిస్ట్లు వేసిన కార్టూన్లను సేకరించడమే కాక, వాటిని శాశ్వతంగా భద్రపరుస్తూ, వివిధ పరిశోధనలకు సహకరిస్తూ కార్టూన్కి కూడా కళాప్రతిపత్తిని, పరిశోధనా సంపత్తిని సమకూరుస్తున్నాయి.

కార్టూన్ థెరపీ

ఇటీవలి కాలంలో మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు మనుషులలో సానుకూలదృక్పథం ఎదుగుదల కోసం, ఒత్తిడుల నుంచి విముక్తి కోసం సంప్రదాయేతర చికిత్సా విధానాలను కూడా సూచిస్తున్నారు. వాటిలో కామెడీ సినిమాలను ప్రదర్శించడమే కాక, హాస్య రసస్పోరకమైన కార్టూన్లను, కార్టూన్ పుస్తకాలను చదవడాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల వ్యక్తులలో హాస్యభావన పెరిగి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోగలిగే ధైర్యం ఒనగూడు తుందని పరిశోధనలలో వెల్లడయింది. అంతేగాక, నవ్వడం