Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చామకూర సెనగ పప్పు కావలసిన వస్తువులు చేమకూర ఆకులు సెనగపప్పు చింతపండు 8 పెద్దవి కరివేపాకు 2 రెబ్బలు 250గ్రా.లు నిమ్మకాయంత ఎండుమిర్చి 3 పచ్చిమిర్చి 6-8 ఆవాలు, జీలకర్ర వెల్లుల్లి 1/4 టీస్పూన్ 6 రెబ్బలు పసుపు 1/4 టీస్పూన్ నూనె 2.1/2 టీస్పూన్లు తగినంత నెయ్యి 1 టీస్పూన్ ఉప్పు తయారుచేసే విధానం సెనగపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి అరచెంచా నూనె, పసుపు వేయాలి. చామకూర ఆకులు కడిగి సన్నగా తరిగి వేసి ఉడికించాలి. పప్పు ఉడికిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, చింతపండులోని నార తీసి చిన్న ముక్కలుగా చేసి వేయాలి. తగినంత ఉప్పు వేసి మరికొద్ది సేపు ఉడికించాలి. ఇంకో చిన్న గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి, పొట్టు తీసి నలక్కొట్టి వేయాలి. కాస్త ఎర్రబడ్డాక ఉడికిన పప్పులో వేసి కలిపి మూత పెట్టాలి. పెసరపప్పు చుక్కకూర తరుగు 200 గ్రా.లు 1 కప్పు ఉల్లిపాయ 1 పచ్చిమిర్చి 4 కారంపొడి కరివేపాకు 1 టీస్పూన్ చుక్క కూర పప్పు కావలసిన వస్తువులు చింతపండు చిన్న నిమ్మకాయంత ఉప్పు తగినంత నూనె 1 టీస్పూన్ ఆవాలు, జీలకర్ర వెల్లుల్లి 1/4 టీస్పూన్ 6 రెబ్బలు తయారుచేసే విధానం 2 రెబ్బలు చుక్కకూర బాగా కడిగి లేత కాడలతోపాటు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెసరపప్పులో కాస్త నూనె, పసుపు వేసి ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసపి మెత్తబడేవరకు వేపాలి. తర్వాత తరిగిన చుక్కకూర, పసుపు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. తర్వాత నార తీసి చిన్నగా ముక్కలుగా చేసుకున్న చింతపండు, కారంపొడి వేసి కలిపి ఉడికిన పెసరపప్పు మెదిపి వేయాలి. తగినంత ఉప్పు వేసి కలిపి మరి కొద్దిసేపు ఉడికించి దింపేయాలి. కాస్త పలుచగా ఉండాలి. తెలంగాణ రుచులు 78