Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెసర పకోడీలు కావలసిన వస్తువులు పెసరపప్పు పచ్చిమిర్చి జీలకర్ర తయారుచేసే విధానం - 2. కప్పులు అంగుళం ముక్క కరివేపాకు 2 రెబ్బలు ఉప్పు తగినంత 5 నూనె వేయించడానికి 1 టీస్పూన్ పెసరపప్పు కడిగి నీళ్ళు పోసి 4 గంటలు నానబెట్టాలి. తర్వాత నీరంతా వడకట్టి పచ్చిమిర్చి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పిండిలో జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కలిపి చేత్తో చిన్న చిన్న ముద్దలుగా చేసి వేడినూనెలో వేయాలి. బంగారురంగు వచ్చేవరకు వేయించుకుని వేడిగా తినాలి. సెనగపిండి గారెలు కావలసిన వస్తువులు సెనగపిండి పసుపు కారంపొడి వెల్లుల్లి 33 సెనగపప్పు తయారుచేసే విధానం 3 కప్పులు 1 టీస్పూన్ 3 టీస్పూన్లు 3 టీస్పూన్లు 1 కప్పు కరివేపాకు మెంతికూర 4 రెబ్బలు 1/4 కప్పు ధనియాల పొడి 3 టేబుల్స్పూన్లు ఉప్పు నూనె తగినంత వేయించడానికి సెనగపిండి జల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్దలో నీళ్ళు పోసి పలుచగా చేసుకోవాలి. సెనగపప్పు నీళ్ళు పోసి అరగంట నానబెట్టాలి. సెనగపిండిలో సన్నగా తరిగిన కరివేపాకు, మెంతికూర, పసుపు, కారంపొడి, ధనియాలపొడి, నానబెట్టిన సెనగపప్పు, అల్లంవెల్లుల్లి నీళ్ళు, తగినంత ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్ళు కలుపుకుంటూ గట్టిగా ముద్దలా తడిపి మూత పెట్టి ఉంచాలి. అరగంట తర్వాత తీసి కాస్త నూనె వేసి బాగా పిసికి నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. ప్లాస్టిక్ కాగితం లేదా తడిబట్ట మీద పలుచగా వత్తుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసుకుని గారెలను వేసి బంగారు రంగు వచ్చేవరకు కాల్చు కోవాలి. ఈ గారెలు పలుచగా వత్తుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. కాస్త మందంగా వత్తుకుంటే మెత్తగా ఉంటాయి. వీటిని చేతులతో వత్తుకునే బదులు పూరీ మిషన్లో వత్తుకుంటే చాలా సులువుగాను పలుచగా కూడా ఉంటాయి. తెలంగాణ రుచులు 74