Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలసందలు 2. కప్పులు ఉల్లిపా పచ్చిమిర్చి 1 5 చిన్నముక్క అలసంద గారెలు కావలసిన వస్తువులు జీలకర్ర 1 టీస్పూన్ కరివేపాకు 2 రెబ్బలు ఉప్పు తగినంత నూనె వేయించడానికి తయారుచేసే విధానం అలసందలు శుభ్రం చేసుకుని నీళ్ళుపోసి 6-8 గంటలు నానబెట్టాలి. తర్వాత నీరంతా వడకట్టి పచ్చిమిర్చి, అల్లం, జీకర్ర కలిపి బరకగా రుబ్బుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కలిపి చిన్న ముద్దలు చేసుకోవాలి. ప్లాస్టిక్ కాగితం లేదా తడి చేసుకున్న అరచేతి మీద వత్తుకుని మధ్యలో చిల్లు పెట్టి వేడినూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. పప్పుల గారెలు కావలసిన వస్తువులు మినప్పప్పు 1 కప్పు కోయగూర 1 కట్ట సెనగపప్పు 1 కప్పు పెసరపప్పు 1 కప్పు పచ్చిమిర్చి ముద్ద కరివేపాకు 2 టీస్పూన్లు 2 రెబ్బలు ఉల్లిపొరక 1 కప్పు ఉప్పు తగినంత జీలకర్ర 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లిముద్ద 1 టీస్పూన్ నువ్వులు 1 టీస్పూన్ నూనె వేయించడానికి - 1 కట్ట మెంతికూర తయారుచేసే విధానం మూడు పప్పులు కడిగి నీళ్ళు పోసి 4-5 గంటలు నానబెట్టాలి. తర్వాత నీరంతా వడకట్టి బరకగా రుబ్బుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపొరక, మెంతికూర, కోయిగూర, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి ముద్ద, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కలపాలి. కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. తడి చేత్తో పిండి చిన్న ముద్దలుగా చేసుకుని అరచేతి మీద లేదా తడిబట్ట మీద వత్తుకుని వేడినూనెలో వేసి వేయించుకోవాలి. ఇందులో ఉప్పు సరిగ్గా ఉండి, బాగా వేగితే రెండు రోజుల వరకు నిలవ ఉంటాయి. తెలంగాణ 73 రుచులు