Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెసర్ల గారెలు కావలసిన వస్తువులు పెసర్లు పచ్చిమిర్చి ఉల్లిపాయ తయారుచేసే విధానం 2 కప్పులు 6 1 చిన్నముక్క కొద్దిగా కరివేపాకు 2 రెబ్బలు కొత్తిమీర ఉప్పు నూనె తగినంత వేయించడానికి పెసర్లు శుభ్రం చేసుకుని నిండా మునిగేంతవరకూ నీళ్ళు పోసి 5-6 గంటలు నానబెట్టాలి. తర్వాత జల్లెట్లో వేసి నీరంతా పోయాక అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లి పాయ, కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె వేడి చేయాలి. చేతులు తడి చేసుకుని చిన్న ముద్ద తీసుకుని కాస్త వెడల్పుగా వత్తుకుని వేడి నూనెలో వేయాలి. రెండువైపులా దోరగా వేయించుకుని తీసుకోవాలి. పెసరపప్పు గారెలు కావలసిన వస్తువులు పెసరపప్పు ఉల్లిపాయ సెనగపప్పు 2. కప్పులు కరివేపాకు 2 రెబ్బలు 1 ఉల్లిపొరక తరుగు 1/2 కప్పు 1/2 కప్పు చిన్నముక్క 1 టీస్పూన్ ఉప్పు తగినంత పచ్చిమిర్చి ముద్ద 2 టీస్పూన్లు నూనె వేయించడానికి తయారుచేసే విధానం పెసరపప్పు, సెనగపప్పు కలిపి కడిగి నీళ్ళు పోసి 5 గంటలు నానబెట్టాలి. తర్వాత జల్లెట్లో వేసి నీరంతా పోయాక చిటికెడు ఉప్పు పక్కన పెట్టుకుని మిగతావి అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లి పాయ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఇష్టముంటే ఉల్లిపొరక తరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. పిండి కలిపి తడి చేత్తో చిన్న ముద్దలు చేసుకుని అరచేతి మీద లేదా ప్లాస్టిక్ కాగితం మీద కాస్త వెడల్పుగా వత్తుకుని వేడినూనెలో వేసి రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. తెలంగాణ 71 రుచులు