చిక్కుడు గింజల కుడుములు కావలసిన వస్తువులు బియ్యం పిండి 1 కప్పు ఆనపకాయ గింజలు 1.1/2 కప్పు ఉల్లిపొర తరుగు తయారుచేసే విధానం - 1 కప్పు అల్లంవెల్లుల్లిముద్ద పచ్చిమిర్చి ముద్ద 1 టీస్పూన్ 1టీస్పూన్ ఉప్పు తగినంత పచ్చి చిక్కుడు గింజలు లేతగా లేకుండా ముదురుగా ఉంటే ఉడికించు కోవాలి. బియ్యం పిండిలో చిక్కుడు గింజలు, పచ్చిమిర్చి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లి ఆకు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తడిపి మూత పెట్టి ఉంచాలి. తర్వాత పిసికి నిమ్మకాయంత ముద్దలు చేసుకుని ఆవిరిమీద ఉడికించుకుని వేడిగా తినాలి. పప్పు కుడుములు కావలసిన వస్తువులు బియ్యం పిండి సెనగపప్పు 2 కప్పులు కొత్తిమీర కొద్దిగా 1/2 కప్పు ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ ఉల్లిపాయ 1 పసుపు 1/4 టీస్పూన్ పచ్చిమిర్చి కరివేపాకు 4 ఉప్పు తగినంత 2 రెబ్బలు నూనె 3 టీస్పూన్లు తయారుచేసే విధానం సెనగపప్పు కడిగి నీళ్ళు పోసి 3 గంటలు నానబెట్టాలి. తర్వాత జల్లెట్లో వేసి నీరంతా పోయిన తర్వాత బరకగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో 1.1/2 కప్పుల నీళ్ళు మరిగించి బియ్యంపిండి, తగినంత ఉప్పు వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత అవసరమైనన్ని నీళ్ళు చిలకరిస్తూ రొట్టెలపిండిలా తడుపుకోవాలి. చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఆవిరిమీద ఉడికించాలి. ఇలా అన్నీ ఉడికించి పెట్టుకోవాలి. ఒక గిన్నె లేదా కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి పసుపు వేసి రెండు నిముషాలు వేపాలి. ఇందులో పప్పు మిశ్రమం వేసి దోరగా తడి ఆరిపోయేవరకు వేపాలి. తర్వాత ఉడికించిన బియ్యంపిండి ఉండలు, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి, నిదానంగా పది నిముషాలు ఉడికించి దింపేయాలి. తెలంగాణ 69 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/90
స్వరూపం