Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోధుమలు ఉల్లిపాయ 1 కప్పు 1 చిన్నది పచ్చిమిర్చి 2 2 రెబ్బలు 1/4 టీస్పూన్ కరివేపాకు పసుపు తయారుచేసే విధానం గోధుమరవ్వ ఉప్మా కావలసిన వస్తువులు కారంపొడి అల్లంవెల్లుల్లి ముద్ద 1/2 టీస్పూన్ 1/2 టీస్పూన్ గరం మసాలా పొడి - 1/4 టీస్పూన్ ఉప్పు నూనె తగినంత 3 టీస్పూన్లు గోధుమలు సన్నగా రవ్వలా విసురుకోవాలి. లేదా గోధుమరవ్వ బజారులో దొరికేది తెచ్చుకోవచ్చు. కడాయి వేడి చేసి ఈ రవ్వను దోరగా పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడేవరకూ వేపాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి వేసి కొద్దిగా వేపి 3 కప్పుల నీళ్ళు పోయాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించిన రవ్వ వేసి కలిపి నిదానంగా ఉడికించాలి. చివర్లో మంట పూర్తిగా తగ్గించి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత దింపేసి ఇష్టముంటే కాస్త నెయ్యి, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇందులో టమాటా లేదా వేరే కూరగాయలు కూడా వేసి చేసుకోవచ్చు. - పచ్చి అలసందలు/బొబ్బర్లు 2 కప్పులు కుడుములు కావలసిన వస్తువులు బియ్యం రవ్వ ఉల్లి ఆకు - 1 కప్పు పచ్చిమిర్చి ముద్ద ఉప్పు - 1 టీస్పూన్ - తగినంత 1 కప్పు కొద్దిగా నూనె - 1/4 కప్పు మెంతాకు తయారుచేసే విధానం బియ్యం పిండిలో పచ్చి అలసందలు/బొబ్బర్లు, పచ్చిమిర్చి కారం, సన్నగా తరిగిన ఉల్లి ఆకు, మెంతాకు, తగినంత ఉప్పు వేసి కలపాలి. గోరువెచ్చని నీళ్లు చల్లుకుంటూ కాస్త గట్టి ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. పది నిముషాలు ఆగి బాగా మెత్తగా అయ్యేలా పిసికి కొంచెం పెద్ద సైజు నిమ్మకాయంత ముద్దలు చేసుకుని వెడల్పుగా వత్తాలి. వీటిని 10-15 నిముషాలు ఆవిరి మీద ఉడికించి కాస్త నూనె వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇది రుచికరమైన, బలవర్ధకమైన ఆహారం. తెలంగాణ రుచులు 68