గోధుమపిండి ఉప్పు నూనె పూరీలు కావలసిన వస్తువులు 2 కప్పులు తగినంత వేయించడానికి తయారుచేసే విధానం గోధుమపిండి జల్లించుకుని ఉప్పు వేసి కలపాలి. తగినన్ని నీళ్ళు కలుపుకుని మృదువుగా రొట్టెలపిండిలా తడిపి మూత ఉంచాలి. పది నిమిషాల తర్వాత కొద్దిగా నూనె వేసి బాగా పిసికి చిన్న ఉండలు చేసుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. పీట మీద పిండి ముద్ద పెట్టి వెడల్పుగా వత్తుకోవాలి. ఇది అంచులు పల్చగా, మధ్యలో మందంగా ఉంటే పూరీ బాగా పొంగుతుంది. వేడి నూనెలో పూరీలను వేసి రెండువైపులా కాల్చుకోవాలి. రొట్టెలు కావలసిన వస్తువులు గోధుమపిండి ఉప్పు నూనె తయారుచేసే విధానం 1 కప్పు తగినంత 1కప్పు గోధుమపిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు కలుపుకుంటూ మరీ గట్టిగా కాకుండా తడుపుకోవాలి. కొద్దిగా నూనె రాసి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి. తర్వాత తీసి బాగా పిసికి మృదువుగా అయ్యాక కొంచెం చిన్న సైజు బత్తాయంత ముద్దలు చేసుకోవాలి. కొంచెం పొడిపిండి ఉంచుకోవాలి. ఒక ముద్ద తీసుకుని కొంచెం వెడల్పుగా వత్తుకోవాలి. దాని పైన కొద్దిగా నూనె రాసి పొడిపిండి జల్లి సగానికి మడత పెట్టాలి. దాని పైన నూనె రాసి, పొడిపిండి జల్లి ఇంకో మడత పెట్టాలి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి జల్లుకుంటూ వెడల్పుగా వత్తుకోవాలి. అంచులు సన్నగా, మధ్యలో కాస్త మందంగా ఉండేలా వత్తుకుని పెనం మీద వేసి నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల రొట్టె పొరలు పొరలుగా మెత్తగా వస్తుంది. పిండిలో పాలు లేదా పెరుగు కొద్దిగా వేసి తడిపితే మరింత మృదువుగా, రుచిగా ఉంటాయి. తెలంగాణ 63 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/84
స్వరూపం