Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొక్కజొన్న గుడాలు/గుగ్గిళ్ళు కావలసిన వస్తువులు తాజా మొక్కజొన్న గింజలు 1 కప్పు ఎండుమిర్చి 4 కరివేపాకు ఉల్లిపాయ 1 రెబ్బ 1. చిన్నది తయారుచేసే విధానం కొత్తిమీర - కొద్దిగా నిమ్మరసం - 1 టీస్పూన్ ఉప్పు - తగినంత నూనె - 2 టీస్పూన్లు తాజా మొక్కజొన్న గింజలను తగినంత ఉప్పు వేసి ఉడికించి జల్లెట్లో వేయాలి. కడాయిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి కొద్దిగా వేపాలి. ఇందులో ఉడికించిన మొక్కజొన్న గింజలు, తగినంత ఉ ప్పు వేసి కలుపుతూ వేయించాలి. వేగిన తర్వాత దింపేసి నిమ్మరసం, కొత్తిమీర వేసుకుని తింటే రుచిగా ఉంటాయి. పెసర్లు ఎండుమిర్చి ఆవాలు, జీలకర్ర కరివేపాకు - ఉల్లిపాయ 1కప్పు 4 పెసర గుడాలు కావలసిన వస్తువులు కారంపొడి 1/2 టీస్పూన్ ఉప్పు తగినంత 1/4 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా 2 రెబ్బలు నూనె 2 టీస్పూన్లు 1 చిన్నది తయారుచేసే విధానం పెసర్లు శుభ్రం చేసుకొని కడిగి నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి. తర్వాత కుక్కర్లో, తగినంత ఉప్పు వేసి ఉడికించి జల్లెట్లో వేసి వార్చుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత ఉడికించిన పెసర్లు, కరివేపాకు వేసి కలుపుతూ వేపాలి. కారంపొడి వేసి ఉప్పు సరి చూసుకుని మరికొద్దిసేపు వేయించి సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 61 రుచులు