పెసరపప్పు వడప్పులు / చెక్కలు కావలసిన వస్తువులు బియ్యంపిండి నువ్వులు కరివేపాకు 3 టేబుల్స్పూన్లు నూనె 100గ్రా.లు 3 రెబ్బలు పెసరపప్పు 250గ్రా.లు ఉప్పు తగినంత రెండంగుళాల ముక్క నూనె వేయించడానికి 6-8 పచ్చిమిర్చి తయారుచేసే విధానం పెసరపప్పు కడిగి నీళ్ళు పోసి గంటసేపు నానబెట్టాలి. బియ్యంపిండి జల్లించుకుని సన్నగా తరిగిన కరివేపాకు తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని ఒక గిన్నెతో కొలుచుకుని ఒకటి పిండికి సగం నీళ్ళు కొలతతో తీసుకుని మరిగించాలి. ఇందులో నూనె, అల్లం, పచ్చిమిర్చి ముద్ద, నువ్వులు, నూనె, పెసరపప్పు వేయాలి. నీళ్లు ఐదు నిముషాలు మరిగిన తర్వాత బియ్యంపిండి వేసి కలిపి దింపి మూతపెట్టి ఉంచాలి. చల్లారిన తర్వాత బాగా పిసికి నిమ్మకాయంత ఉండలు చేసుకుని పల్చగా వత్తుకుని వేడినూనెలో లేత బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి. గుడాలు - గుగ్గిళ్ళు అలసందలు / బొబ్బర్లు గుడాలు కావలసిన వస్తువులు బొబ్బర్లు పచ్చిమిర్చి ఆవాలు, జీలకర్ర కరివేపాకు తయారుచేసే విధానం 1 కప్పు 5 1/4 టీస్పూన్ 1 రెబ్బ కొత్తిమీర అల్లంముక్క కొద్దిగా చిన్నది 1 చిన్నది నూనె 2 టీస్పూన్లు అలసందలు/బొబ్బర్లు శుభ్రం చేసుకుని కడిగి నీళ్ళు పోసి 4-6 గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్ళు మార్చి కుక్కర్లో వేసి కాస్త పసుపు, తగినంత ఉప్పు, నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత జల్లెట్లో వేసి నీరంతా పోయేదాకా ఉంచాలి. కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడాక నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, ఉల్లిపాయ వేసి కొద్దిగా వేపి ఉడికించి బొబ్బర్లు వేసి బాగా వేయించాలి. తడి పూర్తిగా పోయిన తర్వాత ఉప్పు సరి చూసుకుని కొత్తిమీర వేసి దింపేయాలి. ఇష్టముంటే నిమ్మరసం పిండుకోవచ్చు. తెలంగాణ 60 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/81
స్వరూపం