సెనగపిండి వాము 200 గ్రా.లు 2 టీస్పూన్లు అల్లంవెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్ సేవ్ / కారప్పూస కావలసిన వస్తువులు కారంపొడి 1 టీస్పూన్ ఉప్పు తగినంత నూనె వేయించడానికి తయారుచేసే విధానం అల్లం వెల్లుల్లి ముద్దలో మూడు చెంచాల నీళ్ళు పోసి కలిపి వడకట్టి రసం తీసుకోవాలి. సెనగపిండిలో వాము, కారంపొడి, అల్లం, వెల్లుల్లి, నీళ్ళు, గరిటెడు వేడి నూనె, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్ళు పోసి కాస్త మృదువుగా తడిపి మూత పెట్టి ఉంచాలి. పది నిమిషాల తర్వాత కాస్త నూనె వేసి బాగా పిసికి మురుకుల గిద్దెలో సన్న రంధ్రాలున్న బిళ్లతో వేడినూనెలో వత్తుకోవాలి. రెండు వైపులా దోరగా కాల్చుకుని తీసుకోవాలి. చల్లారిన తర్వాత కాస్త నలిపి డబ్బాలో వేసుకోవాలి. బియ్యంపిండి నీళ్లు కారంపొడి నువ్వులు తయారుచేసే విధానం చేగోడీలు కావలసిన వస్తువులు 3 కప్పులు 1.1/2 కప్పు ఇంగువ చిటికెడు వెన్న 50గ్రా.లు 2 టీస్పూన్లు ఉప్పు తగినంత 4 టీస్పూన్లు నూనె వేయించడానికి నీళ్ళు వేడి చేసి వెన్న, ఇంగువ, నువ్వులు, ఉప్పు, కారంపొడి వేసి మరుగుతుండగా బియ్యంపిండి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తరువాత తడి చేత్తో బాగా పిసికి మృదువుగా చేయాలి. చిన్న ముద్ద తీసుకుని పీట మీద అరచేత్తో వత్తుకుంటూ సన్నగా గొట్టంలా చేసుకోవాలి. దీనిని మూడు అంగుళాల సైజులో ముక్కలు చేసుకుని అంచులు కలిపి గట్టిగా వత్తి రింగుల్లా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకుని వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి. చల్లారిన తర్వాత డబ్బాలో నిలవ చేసుకోవాలి. ఇవి నిదానంగా కాల్చాలి. అప్పుడే బాగా ఉడికి కరకరలాడుతూ ఉంటాయి. తెలంగాణ 57 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/78
స్వరూపం