టమాటా సర్వపిండి కావలసిన వస్తువులు బియ్యంపిండి టమాటాలు 3 కప్పులు నువ్వులు 2 టీస్పూన్లు 2 సెనగపప్పు 5 టీస్పూన్లు ఉల్లిపాయ 1 చిన్నది కారంపొడి 1 టీస్పూన్ పచ్చిమిర్చి కరివేపాకు 3 జీలకర్ర 1 టీస్పూన్ 2 రెబ్బలు ఉప్పు 1/4 కప్పు నూనె I తగినంత 1/4 కప్పు ఉల్లిపొరక పల్లీలు తయారుచేసే విధానం 5 టీస్పూన్లు పల్లీలు దోరగా వేయించి పొట్టు తీసి నలక్కొట్టి, సెనగపప్పుతో కలిపి నీళ్ళు పోసి నానబెట్టాలి. నువ్వులు కూడా వేయించుకోవాలి. టమాటాలు చిన్న ముక్కలుగా తరిగి మెత్తగా రుబ్బుకోవాలి. బియ్యంపిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపొరక, నానబెట్టిన పల్లీలు, సెనగపప్పు, నువ్వులు, కారంపొడి, జీలకర్ర, తగినంత ఉప్పు, టమాటా ముద్ద వేసి కలపాలి. తర్వాత తగినన్ని నీళ్ళు పోసి గట్టిగా తడిపి మూత పెట్టి ఉంచాలి. పది నిమిషాల తర్వాత పిసికి పెద్ద సైజు ఉండలు చేసుకోవాలి. మందంగా ఉండే గిన్నె లేదా పాన్ లోపల నూనె రాసి ఈ ఉండను పెట్టి వెడల్పుగా వత్తుకోవాలి. అక్కడక్కడ వేలితో రంధ్రాలు చేసి కొద్దిగా నూనె వేయాలి. చుట్టూ కూడా కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టి మూత పెట్టి నిదానంగా కాల్చుకోవాలి. దోరగా కాలిన తర్వాత తీసేయాలి. బియ్యంపిండి మురుకులు కావలసిన వస్తువులు బియ్యంపిండి సెనగపిండి పుట్నాలపప్పు వెన్న లేదా నూనె తయారుచేసే విధానం 3 కప్పులు 1 కప్పు 1/2 కప్పు 50 గ్రా.లు నువ్వులు 3 టీ స్పూన్లు ఉప్పు తగినంత నూనె వేయించడానికి పుట్నాలపప్పు మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో బియ్యంపిండి, సెనగపిండి, పుట్నాలపప్పు పొడి కలుపుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, నువ్వులు, కరిగించిన వెన్న లేదా నూనె వేసి కలిపి తగినన్ని నీళ్ళు కలుపుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా తడుపుకోవాలి. అరగంట తర్వాత బాగా పిసికి మృదువుగా చేసుకోవాలి. మురుకుల గిద్దె లోపల నూనె రాసి పిండి ముద్ద పెట్టి వేడి నూనెలో మురుకులు వత్తుకోవాలి. రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకుని తీసుకోవాలి. ఇవి వారం రోజులు ఉంటాయి. తెలంగాణ 55 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/76
స్వరూపం