సర్వ పిండి కావలసిన వస్తువులు బియ్యం పిండి 2 కప్పులు సెనగపప్పు 2 టీస్పూన్లు ఉల్లిపాయ 1 చిన్నది జీలకర్ర 1 టీస్పూన్ పచ్చిమిర్చి 3 కారంపొడి 1/2 టీస్పూన్ కరివేపాకు కొత్తిమీర 2 రెబ్బలు కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్ ఉప్పు తగినంత నువ్వులు 3 టీస్పూన్లు నూనె 1/4 కప్పు పల్లీలు 2 టీస్పూన్లు తయారుచేసే విధానం పల్లీలు వేయించి, పొట్టు తీసి నలక్కొట్టాలి. సెనగపప్పు, పల్లీలు కలిపి నీళ్ళు పోసి, అరగంట నానబెట్టాలి. నువ్వులు కూడా వేయించి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వేయించిన నువ్వులు, జీలకర్ర, కారంపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, నానబెట్టిన సెనగపప్పు, పల్లీలు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్ళు పోసి మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా తడిపి మూతపెట్టి ఉంచాలి. పదినిమిషాల తర్వాత బాగా పిసికి కొంచెం పెద్ద సైజు ఉండలు చేసుకోవాలి. మందంగా ఉండే గిన్నె లేదా కడాయి లేదా పాన్ తీసుకుని నూనె రాసి పిండి ముద్దను పెట్టి నూనె రాసుకున్న చేతితో వెడల్పుగా రొట్టెలా సమానంగా వత్తుకోవాలి. అక్కడక్కడ వేలితో గుంటలు చేయాలి. ఇప్పుడు ఈ గిన్నె పొయ్యి మీద పెట్టి చెంచాతో రొట్టె అంచులవైపు, మధ్య గుంతలలో నూనె వేసి మూత పెట్టి నిదానంగా ఉడికించాలి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత తీసేయాలి. ఇది ఇలాగే తినచ్చు లేదా కాస్త నూనె వేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. పాలకూర సర్వ పిండి కావలసిన వస్తువులు బియ్యం పిండి పాలకూర 2 కప్పులు 4 కట్టలు ధనియాలపొడి 1 టీస్పూన్ జీలకర్ర 1 టీస్పూన్ ఉల్లిపాయ 1 చిన్నది నువ్వులు 2 టీస్పూన్లు పచ్చిమిర్చి 5 ఉప్పు తగినంత సెనగపప్పు 2 టీస్పూన్లు నూనె 1/4 కప్పు 2 రెబ్బలు కరివేపాకు తయారుచేసే విధానం గిన్నెలో నీళ్లు మరిగించి పాలకూర ఆకులు కడిగి వేసి దింపేయాలి. చల్లారిన తర్వాత ఆకులను తీసి పచ్చిమిర్చితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. సెనగపప్పును పది నిమిషాలు నీళ్ళు పోసి నానబెట్టాలి. బియ్యంపిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నానిన సెనగపప్పు, నువ్వులు, ధనియాలపొడి, జీలకర్ర వేసి కలపాలి. తర్వాత పాలకూర, పచ్చిమిర్చి ముద్ద, తగినంత ఉప్పు వేసి కలిపి కొద్దికొద్దిగా నీళ్ళు కలుపుకుంటూ గట్టిగా తడిపి మూత పెట్టి ఉంచాలి. పది నిమిషాల తర్వాత మళ్ళీ పిసికి కాస్త పెద్ద సైజు ముద్దలు చేసుకోవాలి. మందంగా ఉండే గిన్నె అడుగున నూనె రాసి ఈ పిండి ముద్ద పెట్టి నూనె రాసుకున్న చేత్తో వెడల్పుగా వత్తుకోవాలి. అక్కడక్కడ వేలితో రంధ్రాలు చేసి కొంచెం నూనె వేయాలి. చుట్టూ కూడా కొంచెం నూనె వేసి పొయ్యి మీద నిదానంగా కాల్చుకోవాలి. ఇష్టముంటే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. తెలంగాణ 53 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/74
స్వరూపం