Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోధుమ, కొబ్బరి పూర్ణాలు కావలసిన వస్తువులు గోధుమపిండి ఉప్పు సెనగపప్పు బెల్లం తయారుచేసే విధానం 250గ్రా.లు చిటికెడు పచ్చి కొబ్బరితురుము ఇలాచిపొడి 200 గ్రా.లు 400గ్రా.లు నెయ్యి నూనె 100 గ్రా.లు - 1 టీస్పూన్ - 3 టీస్పూన్ వేయించడానికి - సెనగపప్పు కడిగి నీళ్లు పోసి గంటసేపు నానబెట్టి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత నీరంతా వడకట్టి బెల్లంతో కలిపి రుబ్బుకోవాలి. ఇందులో కొబ్బరి తురుము కలిపి ఉడికించాలి. పూర్తిగా ఉడికి దగ్గర పడ్డాక నెయ్యి, ఇలాచిపొడి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు కలిపి గరిట జారుగా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. పప్పు ఉండలను గోధుమపిండి మిశ్రమంలో ముంచి వేడినూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి. మినప ఉండలు కావలసిన వస్తువులు మినుములు/మినప్పప్పు - 1 కప్పు నెయ్యి 1/4 కప్పు - 1 కప్పు ఇలా పొడి 1 టీస్పూన్ బెల్లం తయారుచేసే విధానం సగం నెయ్యి వేడి చేసి మినుములు లేదా మినప్పప్పును దోరగా కమ్మని వాసన వచ్చేవరకూ వేయించాలి. చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. బెల్లంలో పావు కప్పు నీళ్ళు పోసి వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి మళ్ళీ మరిగించాలి. ముదురుపాకం వచ్చిన తర్వాత మినప్పిండి, ఇలాచిపొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉ ండలు కట్టుకోవాలి. ఈ మినప ముద్దలు వేరేవిధంగా చేసుకోవచ్చు. మినప్పిండిని బెల్లం తురుము వేసి రుబ్బుకుని ఇలాచిపొడి, నెయ్యి వేసి ఉండలు కట్టుకోవాలి. కొబ్బరి పట్టీ/చిక్కి కావలసిన వస్తువులు ఎండు కొబ్బరి తురుము 250గ్రా.లు నెయ్యి చక్కెర 200 గ్రా.లు ఇలాచి పొడి - 3 టీస్పూన్లు 1/4 టీస్పూన్ తయారుచేసే విధానం చక్కెరలో అరకప్పు నీళ్ళు పోసి మరిగించాలి. అప్పుడప్పుడు పైన తేలిన మురికిని తీసేస్తూ ఉండాలి. ముదురుపాకం రాగానే దింపి నెయ్యి, ఇలాచిపొడి, కొబ్బరితురుము వేసి బాగా కలిపి నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి సమంగా సర్దాలి. వేడిగా ఉన్నప్పుడే చాకుతో గాట్లు పెడితే చల్లారిన తర్వాత ముక్కలు విడగొట్టవచ్చు. తెలంగాణ 48 రుచులు