Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్యారట్ పూర్ణాలు కావలసిన వస్తువులు మినప్పప్పు 1 కప్పు చక్కెర బియ్య 2 కప్పులు పాలు 1.1/2 కప్పులు 1కప్పు ఉప్పు చిటికెడు నెయ్యి ఇలాచిపొడి 1 టీస్పూన్ నూనె 3 టీస్పూన్లు వేయించడానికి క్యారట్ తురుము 2 కప్పులు తయారుచేసే విధానం మినప్పప్పు, బియ్యం కడిగి నీళ్ళు పోసి ఆరుగంటలు నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బుకుని గరిటజారుగా చేసుకోవాలి. కడాయిలో నెయ్యి వేడి చేసి క్యారట్ తురుము వేసి దోరగా వేయించాలి. ఇందులో పాలు, పంచదార వేసి ఉడికించాలి. క్యారట్ ఉ డికి పూర్తిగా దగ్గర పడుతున్నప్పుడు ఇలాచిపొడి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. కడాయిలో నూనె వేడి చేయాలి. క్యారట్ ఉండలు పిండిలో ముంచి వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకుని తీసుకోవాలి. కొబ్బరి, పెసర పూర్ణాలు కావలసిన వస్తువులు మినప్పప్పు బియ్య 1 కప్పు కొబ్బరితురుము 1 కప్పు 2. కప్పులు ఇలాచి పొడి 1 టీస్పూన్ ఉప్పు చిటికెడు నెయ్యి 3 టీస్పూన్ పెసరపప్పు బెల్లం 2 కప్పులు నూనె వేయించడానికి 2 కప్పులు తయారుచేసే విధానం బియ్యం, మినప్పప్పు కడిగి, నీళ్లు పోసి ఆరుగంటలు నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బుకుని గరిటజారుగా చేసుకోవాలి. పెసరపప్పు నీళ్లు పోసి రెండుగంటలు నానబెట్టాలి. తర్వాత జల్లెట్లో వేసి నీరంతా వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని 10 నిమిషాలు ఆవిరిమీద ఉడికించాలి. చల్లారిన తర్వాత పొడిపొడిగా చేసుకోవాలి. ఇందులో కొబ్బరితురుము, చక్కెర కలిపి ఉడికించాలి. ఇది ఉడికి దగ్గర పడ్డాక ఇలాచి పొడి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకుని పప్పు, బియ్యం పిండిలో ముంచి వేడినూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకుని తీసుకోవాలి. తెలంగాణ 47 రుచులు