బెల్లపన్నం / పరమాన్నం కావలసిన వస్తువులు బియ్య పాలు బెల్లం తయారుచేసే విధానం 1/4 కేజి 1/4 లీటరు - 1/4 కేజీ - నెయ్యి 5 టీ స్పూన్లు ఇలాచిపొడి 1 టీస్పూన్ జీడిపప్పు, కిస్మిస్ 10 బెల్లం తురిమి కొద్దిగా నీళ్ళు పోసి వేడి చేసి కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. బియ్యం కడిగి అరగంట నానిన తర్వాత మెత్తగా వండుకోవాలి. గరిటెతో మెదిపి వేడిపాలు, బెల్లం కరిగించిన నీళ్ళు పోసి ఉడికించాలి. అన్నీ కలిసి ఉడికి దగ్గర పడ్డాక నేతితో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, ఇలాచిపొడి వేసి కలిపి మూతపెట్టాలి. చక్కెర పొంగలి కావలసిన వస్తువులు బియ్యం 3 కప్పులు ఇలాచి పొడి 1 టీస్పూన్ పెసరపప్పు చక్కెర 1 కప్పు నెయ్యి 6 టీస్పూన్లు 1/4 కప్పు జీడిపప్పు, కిస్మిస్ 12 తయారుచేసే విధానం బియ్యం కడిగి నీళ్ళు పోసి అరగంట నానబెట్టాలి. రెండు చెంచాల నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకుని పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో బియ్యం వేసి తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి. బియ్యం, పప్పు ఉడికిన తర్వాత గరిటతో మెదిపి చక్కెర వేసి పూర్తిగా కరిగి దగ్గర పడేవరకూ ఉడికించాలి. చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఇలాచిపొడి వేసి కలపాలి. కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. కొర్రలు పాయసం కావలసిన వస్తువులు కొర్రలు పాలు బెల్లం - 100 గ్రా.లు పచ్చి కొబ్బరి తురుము 50 గ్రా.లు - 1 టీస్పూన్ - 2 టేబుల్స్పూన్ - తయారుచేసే విధానం - 500 మి.లీ. 100గ్రా.లు ఇలాచిపొడి నెయ్యి కొర్రలు శుభ్రం చేసి కడిగి నీళ్ళు పోసి గంటసేపు నానబెట్టాలి. తర్వాత మెత్తగా ఉడికించాలి. కొర్రలు ఉడికిన తర్వాత గరిటతో మెదిపి పాలు, బెల్లం. కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఉడికించాలి. బెల్లం కరిగి, బాగా ఉడికి చిక్కబడుతుండగా ఇలాచిపొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 45 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/66
స్వరూపం