Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెసరపప్పు భక్ష్యాలు కావలసిన వస్తువులు పెసరపప్పు చక్కెర నెయ్యి 3 టీస్పూన్లు మైదా 1 కేజి ఇలా పొడి 2 టీస్పూన్లు నూనె/నెయ్యి 1/4 కప్పు తయారుచేసే విధానం పెసరపప్పు కడిగి కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్ళు ఉంటే జల్లెట్లో వేసి వడకట్టాలి. తర్వాత పంచదార కలిపి మిక్సీలో లేదా రోట్లో వేసి రుబ్బుకోవాలి. మందంగా ఉండే గిన్నె లేదా కడాయిలో ఈ పప్పుముద్ద, ఇలాచిపొడి, నెయ్యి వేసి దగ్గర పడేవరకూ వేయించుకోవాలి. మైదాలో చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్ళు కలుపుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి మీద మూత పెట్టి అరగంట నాననివ్వాలి. తర్వాత కాస్త నూనె వేసి బాగా పిసికి చిన్న ఉండలు చేసుకోవాలి. పూర్ణం కూడా కొంచెం పెద్ద సైజు ఉండలుగా చేసుకోవాలి. పిండి ముద్ద తీసుకుని నూనె చేత్తో వెడల్పుగా చేసి పూర్ణం ముద్ద పెట్టి అన్నివైపులనుండి మూసేయాలి. పీట మీద ప్లాస్టిక్ పేపర్ లేదా అరిటాకు పెట్టి నూనె రాసి ఈ ఉండలు వెడల్పుగా చపాతీల్లా వత్తుకోవాలి. పెనం వేడి చేసి నెయ్యి లేదా నూనెతో రెండువైపులా కాల్చుకోవాలి. రవ్వ మైదా ఎండు కొబ్బరిపొడి తయారుచేసే విధానం - కొబ్బరి భక్ష్యాలు కావలసిన వస్తువులు 1/2 కప్పు 1 కప్పు 1 కప్పు 1 కప్పు పొ నూనె 1 టీస్పూన్ 5 టీస్పూన్లు ఒక గిన్నెలో మైదా, రవ్వ, చిటికెడు ఉప్పు కలిపి తగినన్ని నీళ్ళు చల్లుకుంటూ చపాతీపిండిలా తడుపుకోవాలి. ఇది కాస్త మెత్తగానే ఉండాలి. చెంచాడు నూనె వేసి కలిపి మూత పెట్టి అరగంట వదిలేయాలి. ఎండుకొబ్బరి పొడి, బెల్లం, ఇలాచి పొడి కలిపి మిక్సీ లేదా రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంతో చిన్న ఉండలు చేసుకోవాలి. నానిన మైదా పిండి కూడా బాగా పిసికి నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. మైదా ఉండను కాస్త వెడల్పుగా చేసుకుని మధ్యలో కొబ్బరి ఉండలు పెట్టి మూసేయాలి. ప్లాస్టిక్ కాగితం లేదా అరిటాకు మీద నూనె రాసుకుని వీటిని వెడల్పుగా చపాతీల్లా వత్తుకోవాలి. పెనం వేడి చేసి ఈ పోలెలను నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చుకుని పైన మరి కాస్త నెయ్యి వేసుకుని తినాలి. ఇందులో ఎండుకొబ్బరి బదులు పచ్చికొబ్బరి వేసుకుంటే బెల్లం, యాలకులపొడి, పచ్చికొబ్బరి తురుము కలిపి దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి ఉండలు చేసుకోవాలి. మిగతా పద్ధతంతా పైన చెప్పిన విధంగానే ఉంటుంది. తెలంగాణ 38 రుచులు