Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కప్పురభోగి వంటకము కమ్మని గోధుమపిండి వంటయున్ గుప్పెడు పంచదారయును క్రొత్తగ కాచిన యాలనే, పెనర్ పప్పును గొమ్ము నల్లనటి పండ్లును నాలుగు నైదు నంజులున్ లప్పలతోడ క్రొంబెరుగు లక్ష్మణ వజల యింట రూకకున్. (క్రీడాభిరామం) ఆహార పదార్థాలను గురించి ఎవరైనా పరిశోధన చెయ్యాలనుకుంటే ఒక్క శ్రీనాథుడు ఇచ్చిన పదార్థాల పట్టీని వివరిస్తే చాలు. అదే ఒక పరిశోధన గ్రంథం అవుతుంది. ఖండ శర్కర జున్నుకండ చక్కెరలు దోసెలు, వడల్, సేవె పాసెముల తోడ కమ్మగా కాచిన కరియాల నేతితో కమనీయ పంచభక్ష్యములతోడ. సంబారముల తోడి శాక పాకముతోడ పక్వమైన పెసర పప్పుతోడ తేనియధారతో, పానకంబులతోడ శిఖరిషాడబ రసశ్రేణి తోడ అచ్ఛలవణాదికములతోడ అమృత ఖండ పాండురంబైన దధితోడ బ్రాహ్మణులకు భోజనము పెట్టు ద్వాదశీ పుణ్యవేళ లింగమంత్రి నవీన రుక్మాంగదుండు. (భీమేశ్వరపురాణం) పదిహేనవ శతాబ్దిలో తెలుగువారి భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పానీయాలు ఏమిటనేది తెలుసుకోవాలంటే కాశీఖండం చూడాలి. అయితే ఈనాడు వీటిలో సగానికి సగం అర్థంకావు. కొన్ని ఇప్పటికీ తెలుగువారి ఇళ్ళలో ఖాద్య వస్తువులుగా ఉండేవే: “అపూపములు, లడ్డువంబులు, ఇడ్డెనలు, కురుడుములు, అప్పడంబులు. ఇప్పట్లు. గొల్లెడలు, జిల్లడుకాయలు, దోసియలు, సేవియాలు, అంగర పోలియలు, సారసత్తులు, బొంతర కుడుములు, చక్కిలంబులు, మడుగుపూపులు, మోరుండలు. పుండ్రేక్షు ఖండంబులు, పిండ ఖర్జూర ద్రాక్షా నారికేళ కదళీ పనస జంబూ చూత లికుచ దాడిమీ కపిత కర్కాంధూ ఫలములు, గసగసలు, పెసరుంబులుగములు, చెఱకుగుడములు, అరిసెలు. బిసకిసలయములు వరుగులు, చిరుగడములు, బడిదెములు, బులుపలు. బులివరకలు, పప్పురొట్టియలు, చాపట్లు, పాయసంబులు, కర్కరీ కారు వేల్ల కూశ్మాండ నిష్పావపటోలికా కోశాలాబూసి గ్రూదుంబర వార్తాక బింబి కార వింద శలాటువులు, కందయు, బొందము. చారులు, దియ్యగూరలు, పచ్చడులు, బజ్జులు, గిజ్జణులు, వడియంబులు, కడియంబులు. గాయంబులు, గంధతోయంబులు, ఉండ్రాలు, నానుబ్రాలు, అనుములు, మినుములు, బుడు కులు, నడుకులు, నిలిమిడియును. చలిమిడియును. ద్రబ్బెడయు, వడయును, నుక్కెరలు చక్కెరలు, నేతులు, దోనె తొలలు, బిట్టును, గట్టును, దాలతిమ్మ నంబులును, దోపలు, పూపలు, మోదకంబులును గుడోదకంబులు...” పైవన్నీ శాకాహారుల భోజన పదార్థాలు, భోగులు, మాంసాహారులు వేరే విధమైన ఆహారం భుజించేవారు. ఒక్కొక్క మాసంలో బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు ఎలాంటి భోజనం చేసేవారని శ్రీకృష్ణదేవరాయలు వర్ణించి తన పరిశీలనలోని లోతుల్ని తెలిపారు. "ఎండాకాలంలో బ్రాహ్మణులు అరటి పళ్ళు, పనసతొనలు, నేతి ముద్దలవంటి దోస బద్దలు, మామిడిపళ్ళు, ద్రాక్ష పళ్ళు, వడపప్పు, తియ్యదానిమ్మలు. రసదాడి, పానకం తీసుకొనేవారు" (ఆముక్తమాల్యద 2.73). “మాంసాహారులు చేపతునకలతో మామిడి ముక్కలు తాళింపువేసి మధ్యాహ్నంతిని సాయంకాలం తడిపిన ఇసకలో పూన్చిన టెంకాయలను తీసి ఎడనీరు తాగి చేపలకనరు పోగొట్టుకునేవారు' ' (ఆముక్తమాల్యద 2.68) రెడ్లు శ్రావణమాసంలో తినే పదార్థాలను "ఆముక్తమాల్యద" ఇలా వర్ణిస్తున్నది (4-138). గురుగుం, జెంచలి, తుమ్మి, లేకగిరిసాకుం, తింత్రిణీ పల్లవో త్కరమున్. గూడపొరంటి నూనియలతో కట్టావికుట్టారు గో గిరముల్ మెక్కి తమింబసుల్ పొలము వోగ్రేవుల్ మెయిన్నాక. మే కెరువుం గుంపటి మంచమెక్కిరి ప్రభుత్వైకా ప్తి రెడ్లజ్జడిన్. తెలంగాణ 31 రుచుల