తెలంగాణ రుచులు అలనందలను తింటే అజీర్తి, నిద్రలేమి, ఆకలి మందగించడం, గుండెదడ మొదలైన సమస్యలకు మంచి మందుగా పని చేస్తుంది. 250 గ్రా. కార్జంలో గాని, 5 కోడిగ్రుడ్లలో కాని, 500 యాపిల్స్లో గాని, 2 కప్పుల పాలలో గాని, 25 గ్రా. మాంసంలో గాని, మూడు నారింజపండ్లలోగాని ఉండే పోషకాహారం కప్పు తోటకూర రసంలో కూడా ఉంటుంది. అంతేగాక ఇది తేలికగా జీర్ణమవుతుంది.
- తోటకూర అజీర్ణాన్ని, మలబద్ధకాన్ని తొలగిస్తుంది.
శరీరంలోని ఉన్న నీరు తీసేస్తుంది. జలుబు రానీయదు. రక్తహీనత ఉన్నవారికి ఇది చాలా మంచిది. తరుచూ దీనిని ఉపయోగించడం వల్ల దృష్టిలోపం, కాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, శరీరావయవాల లోపం, సంతానహీనత, జలుబులాంటి అనేక వ్యాధులనుండి రక్షణ నిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కూడా మంచి శక్తినిస్తుంది.
- బచ్చలికూరలో శరీరానికి అవసరమైన ఎమైనోయాసిడ్స్,
ఐరన్, విటమిన్ ఇవి, ఫోలిక్ యాసిడ్, ఇంకా చేపలు, మాంసము, గ్రుడ్లు మొదలైనవాటిలో ఉండే మాంసకృత్తులు వున్నాయి. ఈ కూర తినడం వల్ల మలబద్ధకం, నరాల బలహీనత, కీళ్లనొప్పులు, స్థూలత్వం, అజీర్ణాన్ని నివారిస్తుంది. బచ్చలికూర క్రమబద్ధంగా తినడం వలన మూత్రకోశానికి వ్యాధులకు అనారోగ్యానికి మందులా పనిచేస్తుంది. అవిసాకు చెట్టు ఆకు, పూలు, కాయలతో కూరలు చేసుకోవచ్చు. అవిశగింజల నూనె వంటతో, దీపాలు వెలిగించడం అనాదిగా వస్తోంది. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్ ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. పిండి కూరలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల నడుము నొప్పి, తెల్లబట్ట వంటి రోగాలు తగ్గు ముఖం పడతాయి. జబ్బులు తగ్గుతాయి.
- మునగాకు వీర్యవృద్ధిని కలిగిస్తుంది. అజీర్తిని తొలగిస్తుంది.
మునగాకు చారులో జలుబు, మలబద్ధకాన్ని విరోధిస్తుంది.
- కాకరకాయ మధుమేహవ్యాధికి మంచి మందుగా పని
చేస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. కాకరకాయ విరివిగా వాడడం వల్ల రక్తపుపోటు, కంటిజబ్బు, నరాల బలహీనత వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
- దోసకాయ, శరీర తాపాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని
తగ్గిస్తుంది. శరీరంలో నీటివాపుని కూడా తగ్గిస్తుంది. లేతగా 26
ఉండే పచ్చి దోసకాయలు తింటే అజీర్ణం, కడుపుబ్బరం తగ్గుతుంది. దోసకాయ రసం వేసవిలో కలిగే అతిదాహాన్ని నివారిస్తుంది. సౌందర్య సాధనంగా కూడా దీనిని ఉపయోగిస్తారు. కొత్త చింతపండు వాతాన్ని తగ్గించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచి నీటి అరుచిని పోగొడుతుంది. పాత చింతపండు చలవ చేస్తుంది. రోగులకు పథ్యంగా కూడా ఉపయోగిస్తారు.
- నిమ్మకాయలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. నిమ్మరసం
అతిగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదముంది. తక్కువ మొతాదులో తీసుకుంటే వేరే కారణాల వల్ల ఏర్పడిన రాళ్ళని కరిగిస్తుంది. నిమ్మరసం నిత్యాహారంలో తీసుకుంటే జీర్ణాశయంలో హాని చేసే క్రిములు నశిస్తాయి. వేసవిలో వడదెబ్బను, అతిదాహాన్ని తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలకు వేవిళ్లను తగ్గిస్తుంది. నిమ్మపొట్టు, ఆకు, సౌందర్య సాధనాలులో ఉపయోగిస్తారు.
- పచ్చివెలగకాయ గుజ్జు గొంతునొప్పిని కలిగిస్తుంది. ఎండిన
వెలగపండు గుజ్జును తింటే విరేచనాలు తగ్గుతాయి. వ్యాధి ఇది నిరోధకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుంది. అతిదాహాన్ని, నోటి దుర్వాసన, పళ్లు, చిగుళ్ళనుండి రక్తం కారడాన్ని అరికడుతుంది.
- ఉల్లిగడ్డ చల్లదనాన్నిస్తుంది. వడదెబ్బను అరికడుతుంది.
ముక్కు బెదిరితే (రక్తం కారుతుంటే) ఉల్లిని వాసన చూపిస్తే రక్తం కారడం ఆగిపోతుంది. వీర్యవృద్ధిని, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. వాతదోషాన్ని, రక్త పైత్యాన్ని, మొలల వ్యాధిని, రక్త విరేచనాల్ని తగ్గిస్తుంది.
- వెల్లుల్లి కూరను సామాన్యంగా బాలింతలకు ప్రత్యేకమైన
ఆహారంగా పెడతారు. శరీరానికి వేడినిచ్చి అజీర్తిని పోగొడుతుంది. బాలింతలకు చనుబాలు సమృద్ధిగా పడతాయంటారు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
- వంకాయ కాల్చి, పచ్చిమిర్చి, ఉల్లి, ఉప్పుతో కలిపి పిసికి
చింతపండు నీళ్లలో కలిపి పచ్చిపులుసు చేయచ్చు. అప్పుడప్పుడు పల్లీ పొడి కలుపుకోవచ్చు.
వేడినీళ్ళలో పసుపు వేసి ఆవిరి పడితే జలుబు, గొంతువాపు తగ్గుతుంది. కూరలో వేయడం వల్ల శరీరంలోని పురుగును చంపుతుంది. శరీరానికి వేడినిస్తుంది. చిన్న, పెద్ద గాయాలకు మందుగా ఉపయోగపడుతుంది.