తెలంగాణ కాలుస్తారు. ఇది ఎక్కువ ఎర్రగా కాలకూడదు. కొంచెం తెల్లగ వున్నప్పుడే నూనెలో నుండి తీస్తారు. సారె చకినాలు వంకరగా ఉ డకూడదు. వంకరతనం అశుభసూచకమని నమ్మకం. పెండ్లి తర్వాత పదహారవ రోజు జరుపుకునే వేడుకను 'పదహార్ల పండుగ' అంటారు. ఆ రోజు ఐరేణి కుండ కింద పోసిన బియ్యాన్ని విసిరి, ఆ వరిపిండితో అట్టు చేసి, తియ్యపప్పు (ముద్ద పప్పు) వండి పానకం చేసి పెండ్లి పందిరి గుంజలకు నైవేద్యం పెడతారు. ఆ పందిట్లోనే కన్యలను కూర్చుండబెట్టి అట్లు వడ్డిస్తారు. ఆ అట్లను తింటే పెండ్లికాని వాళ్లకు తొందరగా పెండ్లి అవుతుందని అంటారు. తరువాత పెండ్లి పందిరిని కదిలిస్తారు. ఆనాటితో మొత్తం పెండ్లి తంతు పూర్తయినట్లు లెక్క సీమంతం వంటలు సీమంతం సందర్భంలో బంధువులు, అయినవారు మంచి తీపి వంటకాలతో ఆమె ఒడిని నింపుతారు. వీటిని ఆమెనే తినాలనే నియమాన్ని పాటిస్తారు. సీమంతంనాడు వచ్చిన బంధువులందరికీ ఆనాటి వంటలలో సద్దులకు అంటే చిత్రాన్నాలకు ప్రాముఖ్యం వుంటుంది. చింతపండు పులిహోర, కొబ్బరన్నం, ఆవన్నం, నువ్వన్నం, దద్దోజనం వీటిని సద్దులంటారు. సీమంతంనాడు ఇలా సద్దులు కలపడం ఆచారం. ఉగాది ఉగాది పచ్చడిలో ఉపయోగించుకునే ప్రతి వస్తువులో ఆయుర్వేద వైద్య అంశాలు ఇమిడి ఉన్నాయి. వేపాకుపూత కళ్లకు మంచిది, కుష్ఠురోగాన్ని, నోటి అరుచిని పోగొడుతుంది. అందువల్ల వేపపువ్వును పచ్చడిలో ఉపయోగించుకుంటారు. ఈ వేపపువ్వు వాతాన్ని ఎక్కువ చేస్తుంది. ఈ వాతగుణాన్ని పోగొట్టడానికి ఇందులో కొత్త బెల్లాన్ని వేసుకుంటారు. బెల్లం జీర్ణశక్తిని కలిగిస్తుంది. కాని కఫాన్ని ఎక్కువ చేస్తుంది. దీన్ని పోగొట్టడానికి మిరియాల పొడిని చేర్చుకుంటారు. ఈ ఉగాది పచ్చడి వాత, పిత్త, కఫ దోషాన్ని హరిస్తుంది. ఈ పచ్చడిలో వేసుకునే మామిడిపిందె ముక్కల వల్ల గొంతు సంబంధమైన రోగాలను, ఉబ్బనరోగాన్ని తగ్గించి వేస్తుంది. చింతపండు పులుసు మలబద్ధకాన్ని తొలగించి మంచి విరోచనకారిగా పని చేస్తుంది. ఇలా దీనిలోని అన్ని వస్తువులు శరీరారోగ్యానికి ఎంతో మేలు చేసేవిగా ఉంటాయి. ఎల్లిపాయ కారం శరీరానికి వేడినిచ్చి, మలబద్ధకాన్ని పోగొడ్తుందని బిడ్డ పుట్టిన తరువాత తల్లిలో (బాలింతలో) ఋతుస్రావాన్ని చక్కబరచి చెడు రక్తాన్ని తొలగిస్తుందని భావిస్తారు. పండుగలు - ప్రత్యేక వంటలు పోషకాలు తొలిఏకాదశి - తెలంగాణంలోని ఖమ్మం జిల్లాలో తొలి ఏకాదశినాడు మక్కపేలాల (మొక్కజొన్న పేలాలు)తో పిండిని విసిరికొని బెల్లం, నెయ్యి కలిపి పేలపిండి అనే ప్రత్యేకమైన పిండిని తయారుచేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టి తరువాత ఆ నైవేద్యాన్ని ఇంటిల్లిపాదీ తినడం ఆచారం. ఆ రోజు పేలపిండిని తినకపోతే దయ్యమై పుడతారని అంటారు. సంక్రాంతి తెలంగాణాలో సంక్రాంతి రోజు వండుకునే పిండివంటలను ప్రత్యేకంగా నువ్వులతో చేసుకుంటారు. సకినాలు, నువ్వుల ముద్దలు, నువ్వులు చల్లిన నూనె పోలెలు, నువ్వుల కరిజెలు (కజ్జికాయలు), సద్ద రొట్టెలు బెల్లం కలిపి దంచి ముద్దలు చేసుకుంటారు. సంక్రాంతి రోజుల్లో వండుకునే వంటకాలు, పిండివంటలు అన్నీ శరీరారోగ్యానికి దోహదం చేసేవిగా ఉన్నాయి. నువ్వులు, గుమ్మడికాయ, బెల్లం, సద్దరొట్టెలు (సజ్జ రొట్టెలు) ఇవన్నీ సంక్రాంతి నెలలోని విపరీతమైన చలి నుండి, శరీరానికి వేడినిచ్చి ప్రజల ఆరోగ్యాలను ఈ కారణం వలే పండుగ రోజుల్లో నువ్వుల పదార్థాలను తినడం, తమ వాళ్లకు పంచడం తెలంగాణాలో ఒక సాంప్రదాయంగా నిలిచింది. పీర్ల (మొహర్రం) పండగ పీర్లపండగ - మొహర్రం - దీనిని పీర్ల పండుగ అని కూడా అంటారు. హిందూ, ముస్లింల సమైక్య పండగ ఒక ప్రతీక. ఈ 22 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/43
స్వరూపం