తెలంగాణ రుచులు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ముస్లింలు పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా కఠిన ఉపవాసం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ సమయానికి తమకు ఇష్టమైన ఆహారం స్వీకరిస్తారు. అయితే రంజాన్ మాసంలో ముస్లింలందరూ అత్యంత ఇష్టంగా తీసుకునే ఆహారం హలీం. ఒకప్పుడు కేవలం నిజాం నవాబుల ఇఫ్తార్ విందులకే పరిమితమైన హలీం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ హలీం తయారీలో వాడే పదార్థాలన్నీ పోషక విలువలు కలిగి ఉండడంవల్ల మరుసటి రోజు ఉపవాసానికి అవసరమైన శక్తిని ఈ హలీం శరీరానికి అందిస్తుంది. హలీంలో రకాలు మటన్ హలీం, చికెన్ హలీం, వెజ్ హలీం లాంటి రకాలున్నా మటన్ హలీం వైపు ఎక్కువమంది మక్కువ చూపుతారు. హలీం తయారీ కోసం ప్రత్యేకంగా బట్టీలను ఏర్పాటు చేసి అందులో బిగించిన పెద్ద రాగి బానల్లో హలీంను వండుతారు. ఈ హలీం తయారీకి దాదాపు తొమ్మిది గంటల సమయం పడుతుంది. శుభ్రంగా కడిగిన పొట్టేలు మాంసాన్ని, పచ్చిమిర్చిని రాగిబాండీల్లో దాదాపు ఆరుగంటలపాటు ఉడికించి మెత్తగా చేస్తారు. ఆ తరువాత అందులో గోధుమరవ్వ వేసి దాదాపు గంట పాటు ఉడికిస్తారు. అందులో శుద్ధమైన నెయ్యి, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకలు, జీలకర్ర, సాజీరా, గులాబీ మొగ్గ, కాజు, బాదం, కందిపప్పు, శనగపప్పు, డ్రై ఫ్రూట్స్, అల్లం, వెల్లులి పేస్ట్ మొదలైనవి వేసి కలుపుతూ దాదాపు రెండు గంటల పాటు ఉడికిస్తారు. అలా ఉడికిన పదార్థం మెత్తగా రావడానికి గోటా అనే చెక్క పరికరంతో దాదాపు 45 నిమిషాలపాటు బలంగా కొడుతూ కలియబెడతారు. దీనినే గోటా మార్ నా అని పిలుస్తారు. దీంతో రుచికరమైన సువాసనాభరితమైన హలీం తయారవుతుంది. హలీం కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా ఇప్పుడు హిందువులు సైతం ఇష్టంగా తింటున్నారు. వీరిలో శాకాహారుల కోసం ప్రత్యేకంగా వెజ్ హలీం తయారుచేస్తున్నారు. తమవద్ద హలీం కోసం వచ్చేవారిలో దాదాపు 40 శాతం మంది హిందువు లుంటారని హలీం సెంటర్ నిర్వాహకులు కూడా అంటున్నారు. ఒక రకంగా హలీం నేడు హిందూ, ముస్లింల సమైక్య భావానికి ప్రతీకగా నిలుస్తోంది. హలీమ్తో పాటుగా అందరికీ ఇష్టమైనది, రంజాన్ మాసం కోసం ఎదురుచూసేది, మిత్రులు, బంధువులతో పంచుకునేది షీర్ కుర్మా. సన్నని సేమ్యా, పాలు, పలుకులు, ఖర్జూరం కలిపి తయారుచేస్తారు. అదే విధంగా హిందువులు కూడా పెళ్లిళ్లు, 20 శుభకార్యాలలో మొఘలాయి వంటకాలైన బిర్యానీ, డబల్ కా మీఠా, ఫిర్ని, కుబానీ కా మీఠా, షాహి టుకడా మొదలైనవి చేయిస్తూ వుంటారు. రుచికరమైన ఆహారానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే కదా! మొఘలాయి వంటకాలలో ప్రముఖమైనవి ఎక్కువగా మాంసాహారమే. ఇవి రుతువులు, కాలాలకనుగుణంగా తక్కువ, ఎక్కువ మసాలాలతో తయారవుతాయి. వీటిలో ముఖ్యమైనవి షామి కబాబ్, షికంపూరి కబాబ్, మాయిఖలియా, దో ప్యాజా. మరగ్, పాయా, నిహారీ మొదలైనవి అందరూ ఇష్టపడతారు. మరొక ప్రముఖమైన వంటకం పత్తర్ కా ఘోష్.. పలుచటి రాయి క్రింద నిప్పులుపెట్టి మసాలా రాసి నానబెట్టిన గొర్రెమాంసం ముక్కలను కాలుస్తారు. చాలా రుచిగా ఉంటుంది. దాదాపు ప్రతీ ముస్లిము ఇంట్లో ప్రతీ ఆదివారం లేదా తరచూ చేసుకునే వంటకం ఖిచడీ, కీమా, కట్టా (మన పచ్చి పులుసులా ఉంటుంది). చలికాలం కాని కాస్త బలహీనంగా ఉన్నారనిపిస్తే వెంటనే పాయా తిన మంటారు. దీనికి తోడుగా షీర్మల్ రొట్టెలు. ఇక్కడ అంటే హైదరాబాదులో ఎన్నో రకాల రొట్టెలు తయారవుతాయి. ఫలానా కూరకు ఫలానా రొట్టెలు ఉండాల్సిందే. షీర్మల్, నాన్, బైదా రోటి, మొఘలాయి పరాఠా, ఖమీరీ రోటి.. హైదరాబాదీ ముస్లీముల వంటకాలలో ఎక్కువగా మాంసాన్ని మసాలాలు కలిపి నిదానంగా ఎక్కువసేపు ఉడికిస్తారు. దీనివల్ల వాటి సారమంతా దిగుతుంది. అప్పుడు ఆ వంటకాలను తినడం వల్ల అందులో ఆరోగ్యపోషక విలువలన్నీ మనకు అందుతా యంటారు. మాంసం మాత్రమే కాక తలకాయ కూర, కాళ్ల కూర, రెండూ కలిపి చేసే చాక్నా, నిహారి, బోటి, కలేజి, గుర్దా కపుర్, బేజా మొదలైనవి కూడా ఇష్టంగా తింటారు. మాంసాహారం మాత్రమే కాదు శాకాహార వంటకాలు కూడా వినియోగంలో ఉన్నాయి. టమాటర్ కా కూట్, దహి కీ కఢీ మొదలైనవి ఎన్నో ఉన్నాయి.
పుట:తెలంగాణ రుచులు.pdf/41
స్వరూపం