సోఫియాని బిర్యాని కావలసిన పదార్థాలు చికెన్ షాజీర ఉల్లిపాయలు 1 కేజి దాల్చిన చెక్క 2 టీ స్పూన్స్ 2 వేయించిన ఉల్లిపాయలు నెయ్యి 2 అంగుళాల ముక్క 50 గ్రా.లు. 250గ్రా.లు బాస్మతీ బియ్యం 500 గ్రా.లు పెరుగు 100గ్రా.లు ఉప్పు తగినంత క్రీమ్ 200 గ్రా.లు అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ పుదీనా + కొత్తిమీర గుప్పెడు పాలు 100 మి.లీ. యాలకులు లవంగాలు 12 8 నిమ్మకాయ 1 తయారుచేసే విధానం చికెన్ ముక్కలు శుభ్రం చేసుకుని, నిమ్మరసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా కలిపి మూతపెట్టి అరగంట ఉంచాలి. బాస్మతీ బియ్యం కడిగి పది నిమిషాలు నాననివ్వాలి. పెద్ద గిన్నెలో 3-4 లీటర్ల నీళ్లు పోసి గరం మసాలా దినుసులు, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతుండగా నానిన బియ్యం వేసి సగం కంటే కొంచెం ఎక్కువ ఉడికిన తర్వాత తీసి జల్లెట్లో వేయాలి. మందంగా, వెడల్పుగా ఉన్న గిన్నెలో నెయ్యి వేసి నానబెట్టిన చికెన్ మిశ్రమం పరచి, దానిపైన అన్నం వేసి సమానంగా చేయాలి. దానిపైన పాలు, మిగిలిన నెయ్యి వేసి మూతపెట్టి, తడిపిన గోధుమపిండితో సీల్ చేసి చిన్న మంటమీద అరగంట ఉడికించుకోవాలి. మొత్తం తయారీలో తెలుపురంగు మారకుండా జాగ్రత్తపడాలి. మటన్ కీమా నూనె 500 గ్రా.లు 3 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయలు 2 హైదరాబాదీ కీమా కావలసిన పదార్థాలు బంగాళాదుంపలు టమాటాలు చింతపండు పులుసు 100 గ్రా.లు 2 1/2 కప్పు అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ కరివేపాకు 2 రెబ్బలు పసుపు 1/2 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కారంపొడి 2 టీ స్పూన్స్ గరంమసాలా పొడి 1/2 టీ స్పూన్ ధనియాలపొడి 2 టీ స్పూన్స్ ఉప్పు తగినంత పచ్చిబఠానీలు 100 గ్రా.లు తయారుచేసే విధానం కీమా కడిగి జల్లెట్లో వేసుకోవాలి. పాన్లో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. తర్వాత కారంపొడి, ధనియాలపొడి వేయాలి. కీమా, తగినంత ఉప్పు, కరివేపాకు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. అవసరం అయితే కొన్ని నీళ్లు వేసుకోవచ్చు. కీమా ముప్పావు ఉడికిన తర్వాత బంగాళాదుంప ముక్కలు, పచ్చిబఠానీలు, టమాటా ముక్కలు వేసి కలిపి ఉడికించాలి. ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసి చిక్కబడి, నూనె తేలేవరకు ఉడికించాలి. చివరలో కొత్తిమీర, గరంమసాలా పొడి వేసి కలపాలి. తెలంగాణ 302 రుచుల
పుట:తెలంగాణ రుచులు.pdf/323
స్వరూపం