కోఫ్తా: నర్గీసీ కోఫ్తా కావలసిన పదార్థాలు కూరకోసం: ఉడికించిన గ్రుడ్లు కీమా కారంపొడి పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు గరంమసాలా పొడి మిరియాల పొడి పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు పుదీనా తరుగు బ్రెడ్ పొడి నూనె తయారుచేసే విధానం - I - 5 200 500 (P.CO 1 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ 1 టీ స్పూన్ తగినంత 1 టీ స్పూన్ నూనె ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ముద్ద కారంపొడి 2 టేబుల్ స్పూన్స్ 4 పెద్ద 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ పసుపు 1/4 టీ స్పూన్ గరంమసాలా పొడి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ 3-4 టమాటా నూరిన ముద్ద జీడిపప్పులు 1 కప్పు 10-15 2 టీ స్పూన్స్ (నానబెట్టి ముద్ద చేసుకోవాలి) 2 టీ స్పూన్స్ 1/4 కపు కొద్దిగా నూనె 2 టీ స్పూన్స్ కొత్తిమీర వేయించడానికి సరిపడా. ముందుగా శుభ్రం చేసుకున్న కీమా ఉప్పు, కారంపొడి, పసుపు, అల్లం వెల్లుల్లిముద్ద, గరంమసాలా పొడి, మిరియాల పొడి, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, పుదీనా, చెంచాడు నూనె, బ్రెడ్ పొడి కలిపి మెత్తగా, గట్టిగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని చిన్న బంతి సైజు ఉండలు చేసుకోవాలి. నూనె రాసుకున్న అరచేతిలో ఈ ఉండ పెట్టి వెడల్పుగా తట్టి ఉడికించి, పొట్టు తీసిన గ్రుడ్డు పెట్టి అన్నివైపులనుండి మూసేయాలి. అన్నీ అలాగే చేసుకుని వేడి నూనెలో జాగ్రత్తగా వేసి మీడియం మంటమీద అన్నివైపులా బంగారు రంగు వచ్చేలా కాల్చుకోవాలి. వెడల్పాటి గిన్నె లేదా పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి బంగారు రంగ వచ్చేవరకూ వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తర్వాత మిక్సీ పట్టిన టమాటా ముద్ద వేసి నూనె తేలేవరకూ నిదానంగా మూతపెట్టి ఉడికించాలి. ఇప్పుడు జీడిపప్పు ముద్ద, కాసిన్ని నీళ్లు వేసి కలిపి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత వేయించిన కోప్తాలు వేసి మరో పదినిమిషాలు నిదానంగా ఉడికించాలి. నూనె తేలిన తర్వాత కొత్తిమీర వేసి దింపేయాలి. తెలంగాణ 301 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/322
స్వరూపం