Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలంగాణ కీమా ఉల్లిపాయలు అల్లం, వెల్లుల్లి ముద్ద శనగపిండి గ్రుడ్డు గలౌటి కబాబ్ - 5 కావలసిన పదార్థాలు 500 గ్రా.లు గరం మసాలా పొడి 2 కారంపొడి 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు 2 టేబుల్ స్పూన్స్ నూనె 1 1/2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ తగినంత 1/2 కప్పు తయారుచేసే విధానం కీమా కడిగి జల్లెట్లో నీరంతా పిండేయాలి. కడాయిలో చెంచాడు నూనెవేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేయించుకొని ముద్దగా నూరుకోవాలి. కీమా, ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, గుడ్డు కొట్టి వేసి రుబ్బుకోవాలి. ఈ ముద్ద ఒక గిన్నెలోకి తీసుకొని శనగపిండి వేయించి కలపాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి చిన్న ఉండలు చేసుకొని కొద్దిగా వెడల్పుగా వత్తుకోవాలి. పెనం మీద నూనెవేసి ఈ కబాబ్లను పెట్టి నిదానంగా వేయించాలి. రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసి ఉల్లిపాయ చక్రాలతో వడ్డించాలి. కాకోరి కబాబ్ కావలసిన పదార్థాలు మటన్ కీమా అల్లం, వెల్లుల్లి ముద్ద మిరియాల పొడి కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి బొప్పాయి నూరిన ముద్ద ఉప్పు లవంగాలు యాలకులు తయారుచేసే విధానం 400 గ్రా.లు 1 టీ స్పూన్ దాల్చినచెక్క జీలకర్ర - 2 అంగుళాల ముక్క - 1 టీ స్పూన్ - 1/4 టీ స్పూన్ జాజికాయ, జాపత్రి పొడి - 1/4 టీ స్పూన్ - కొద్దిగా 2 కప్పులు 3 2 టేబుల్ స్పూన్స్ నల్ల యాలకులు తగినంత గ్రుడ్డు 4 నెయ్యి 20 వేయించిన ఉల్లిపాయలు సెనగపప్పు వేయించి చేసిన పొడి - 1/2 కప్పు - 1 1 1/4 కప్పు కీమా కడిగి నీరంతా పిండేసి, జల్లెట్లో వేయాలి. సెనగపిండి, గుడ్డు, నెయ్యి తప్ప మిగిలిన మసాలా దినుసులు పొడి చేసి కలిపి కీమా, మిగతా వస్తువులు కలిపి గట్టిగా, మెత్తగా ముద్ద చేసుకోవాలి. చేత్తో బాగా పిసికి సెనగపిండి, గుడ్డు కొట్టివేసి కలిపి కనీసం గంటసేపు ఫ్రిజ్లో పెట్టాలి. తినడానికి అరగంట ముందు తీసి సీకులకు అన్నివైపులనుండి సమానంగా పెట్టి వత్తాలి. ఓవెన్ గ్రిల్లో లేదా నిప్పులమీద అన్నివైపులా ఎర్రగా అయేట్టు కాల్చుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి రాస్తూ ఉండాలి. 298