షాహీ కబాబ్ - 4 కావలసిన పదార్థాలు మాంసం కీమా శనగపప్పు ఉల్లిపాయ అల్లం, వెల్లుల్లి ముద్ద ధనియాలు లవంగాలు ఇలాచీలు (చిన్నవి) ఇలాచీలు (పెద్దవి) దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మిరియాలు ఎండుమిర్చి ఉపు నూనె మసాలాపొడి ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు 1/2 కేజి 1/4 కప్పు 1 2 టీ స్పూన్స్ - 2 టీ స్పూన్స్ I I 1 టీ స్పూన్ 3-4 2 2 1 అంగుళం ముక్క J 1 5 4-5 తగినంత 1/4 కప్పు 1 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ 2 తగినంత తయారుచేసే విధానం శనగపప్పు నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. మాంసం కీమా శుభ్రంగా కడిగి నీరంతా పిండేయాలి. ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. కుక్కర్లో కీమా తీసుకొని శనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర, లవంగాలు, ఇలాచీలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు, ఎండుమిర్చి, ఉప్పు, అరకప్పు నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత అందులో ఇంకా నీరుంటే మరికొద్దిసేపు ఉంచాలి. నీరంతా ఇగిరిపోయిన తర్వాత దింపేయాలి. చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. పెద్దనిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండ తీసుకుని వెడల్పుగా చేసి కొంచెం ఉల్లిపాయ మిశ్రమం పెట్టి మూసేసి గుండ్రంగా చేసుకోవాలి. వాటిని కాస్త వెడల్పుగా వత్తుకుని పెనం మీద నూనె వేస్తూ కాల్చుకోవాలి. రెండువైపులా ఎర్రగా అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ చక్రాలతో వేడిగా సర్వ్ చేయాలి. తెలంగాణ 297 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/318
స్వరూపం