Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బోటీ కబాబ్ - 1 కావలసిన పదార్థాలు కారంపొడి 1. మాంసం 500 గ్రా. తందూరి రెడ్ కలర్ 5-6 చుక్కలు ధనియాల పొడి I నిమ్మరసం 1 టీ స్పూన్ వెనిగర్ ఆమ్చూర్ 1 టీ స్పూన్ ఉప్పు అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్స్ నూనె 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ 2. పెరుగు 1 కప్పు మసాలాపొడి పచ్చి బొప్పాయి తురుము 1 టేబుల్ స్పూన్ లవంగాలు 3 షాజీర 1 టీ స్పూన్ వాము 1 టీ స్పూన్ దాల్చిన చెక్క ఇలాచీలు పెద్దవి 1 అంగుళం ముక్క 3 జాజికాయ పొడి టీ 1/4 టీ స్పూన్ షాజీర నల్ల ఉప్పు 1/2 టీ స్పూన్ కసూరీ మేతి 1 టీ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం పైన మసాలా వస్తువులన్నీ కలిపి పొడి చేసుకోవాలి. మాంసం ముక్కలను కడిగి, తడి లేకుండా బట్టతో తుడవాలి. నిమ్మరసం, ఆమ్చూర్ పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి మాంసం ముక్కలు వేసి బాగా పట్టించి అరగంట మూతపెట్టి ఉంచాలి. గట్టి పెరుగు, బొప్పాయి తురుము, షాజీర, వాము, జాజికాయ పొడి, నల్ల ఉప్పు, కారంపొడి, ధనియాల పొడి, వెనిగర్, నూనె, ఉప్పు వేసి కలిపి అందులో నానబెట్టిన మాంసం ముక్కలను వేసి కలిపి మరో మూడు గంటలు నాననివ్వాలి. తర్వాత కబాబ్ చేసే సీకులకు 5- 6 మటన్ ముక్కలను గుచ్చి పైన కొంత మసాలా రాసి ఓవెన్ లో పెట్టి బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. మధ్య మధ్య నూనె రాస్తూ ఉండాలి. చివరగా మసాలాపొడి చల్లి, నిమ్మరసం వేసి వేడిగా వడ్డించాలి. టంగ్జీ కబాబ్ - 2 కావలసిన పదార్థాలు కోడి కాళ్లు (డ్రమిక్స్) నిమ్మరసం 8 ఉప్పు 3/4 టీ స్పూన్ 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ కారంపొడి 1/2 టీ స్పూన్ ఉప్పు తగినంత అల్లం, వెల్లుల్లి ముద్ద కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్ కొద్దిగా గడ్డ పెరుగు 1 కప్పు నూనె 4 టేబుల్ స్పూన్స్ క్రీమ్ 1/4 కప్పు చాట్ మసాలాపొడి 3 టీ స్పూన్స్ గ్రుడ్డు 1 తయారుచేసే విధానం కోడి కాళ్లను కడిగి, తుడిచి చాకుతో రెండు మూడు కాట్లు పెట్టాలి. ఒక గిన్నెలో నిమ్మరసం, 1/2 టీస్పూన్ కారంపొడి, ఉప్పు కలిపి చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి. గడ్డపెరుగులో గ్రుడ్డు, క్రీమ్, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. అరగంట నానిన చికెన్ ముక్కలను ఇందులో వేసి కలిపి 2-3 గంటలు నానబెట్టాలి. ఫ్రిజ్లో పెడితే మంచిది. తర్వాత తందూర్ ఓవెన్ లేదా గ్రిల్లర్లో ఈ ముక్కలను ఎర్రగా అయ్యేవరకు కాల్చుకోవాలి. మధ్య మధ్యలో నూనె రాస్తూ ఉండాలి. చివరగా చాట్ మసాలా పొడి చల్లి నిమ్మరసం పిండి వేడిగా వడ్డించాలి. తెలంగాణ 295 రుచులు