మిరపకాయలు చింతపండు పులుసు పసుపు కారంపొడి ఉప్పు కొబ్బరిపొడి జీలకర్ర పొడి మెంతిపొడి పల్లీల పొడి నువ్వుల పొడి మిర్చి కా సాలన్ కావలసిన పదార్థాలు ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు అల్లం, వెల్లుల్లి ముద్ద జీలకర్ర 250గ్రా.లు 1/4 కప్పు 1/4 టీ స్పూన్ 1 టీ స్పూన్ తగినంత 3 టేబుల్ స్పూన్స్ 1 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ 1 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ తయారుచేసే విధానం గరం మసాలాపొడి మెంతులు నూనె 1 టీ స్పూన్ చిటికెడు 4 టేబుల్ స్పూన్స్ ఈ కూర కోసం బజ్జీ మిరపకాయలను వాడాలి. రుచి బావుంటుంది. మిరపకాయలను మధ్యలో చాకుతో కాటు పెట్టి గింజలు తీసేయాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలలో కారం తగ్గుతుంది. ప్యాన్ నూనె వేడి చేసి మిరపకాయలను కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి. ఒక గిన్నెలో చింతపండు పులుసు, వేయించిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారంపొడి, కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు, పల్లీల పొడి, నువ్వుల పొడి, జీలకర్ర, మెంతిపొడి వేసి బాగా కలిపి ఉంచాలి. ఇందాక మిరపకాయలు వేయించిన ప్యాన్లోనే నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక పొడులన్నీ కలిపిన చింతపండు పులుసు కప్పుడు నీళ్లు పోసి నిదానంగా మరిగించాలి. పులుసు, పొడులు ఉడికి కమ్మటి వాసన వస్తుండగా వేయించిన మిరపకాయలు, గరంమసాలా పొడి వేసి మరో ఐదు నిమిషాలు మసాలాలో ఉడకనిచ్చి నూనె తేలగానే దింపేయాలి. ఈ కూర బిరియాని, వెజ్ ఫ్రైడ్ రైస్, పులావ్లకు, రొట్టెలకు బావుంటుంది. తెలంగాణ 291 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/312
స్వరూపం