ఫిర్నీ కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం పాలు 50 గ్రా.లు చక్కెర ఏలకులపొడి బాదాం పలుకులు 1 లీటరు 100 గ్రా.ల 1/2 టీ స్పూన్ 5 కుంకుమ పువ్వు చిటికెడు తయారుచేసే విధానం బాస్మతి బియ్యం కడిగి ఒక గంట నాననివ్వాలి. తర్వాత వడగట్టి గ్రైండర్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పాలు కాగనివ్వాలి. అవి మరుగుతుండగా ఈ బియ్యం పొడి వేసి నిదానంగా ఉడికించాలి. ఉడికి చిక్కబడిన తర్వాత చక్కెర, యాలకుల పొడి వేసి మరికొంత సేపు మరగనివ్వాలి. చివర్లో కుంకుమ పువ్వు వేసి కలిపి దింపేయాలి. ఈ పాయసం ఇంకా చిక్కగా, రిచ్ కావాలనుకుంటే మిల్క్ మెయిడ్ కూడా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న బాదాంపలుకులు వేసి చల్లగా సర్వ్ చేయండి. ఫలూదా కావలసిన పదార్థాలు 1 కప్పు తయారుచేసే విధానం రైస్ సేమియా సబ్జా గింజలు పాలు చక్కెర రోజ్ సిరప్ ఐస్క్రీమ్ 3 టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ 100 గ్రా.ల 2 టేబుల్ స్పూన్స్ 6 పెద్ద చెంచాలు ఒక కప్పు పాలల్లో సబ్జాగింజలు సుమారు రెండు గంటలు నానబెట్టాలి. చిన్నగా, నల్లగా ఉన్న గింజలు బాగా నానిన తర్వాత కాస్త రంగు మారి, ఉబ్బుతాయి. మిగిలిన పాలల్లో చక్కెర వేసి కలిపి ఫ్రిజ్లో పెట్టాలి. 3 కప్పుల నీళ్లు మరిగించి ముక్కలు చేసిన సేమ్యా వేసి ఐదు నిమిషాలు ఉడికించి జల్లెట్లో వేసి చన్నీళ్లు పోయాలి. వీటిని కూడా ఫ్రిజ్ లో పెట్టాలి. సబ్జా, పాలు అన్నీ కలిపి పెట్టుకోవాలి. పొడవాటి గ్లాసులో కొన్ని సేమ్యా, పైన సబ్జా పాలు పోసి కొంచెం రోజ్ సిరప్ వేసి పైన చెంచాడు ఐస్క్రీమ్ వేసి సర్వ్ చేయాలి. తెలంగాణ 289 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/310
స్వరూపం