తెలంగాణ ఖుర్బానీ (ఖుమానీ) కా మీఠా కావలసిన పదార్థాలు 200 గ్రా.లు ఖుర్బానీ / ఏప్రికాట్స్ చక్కెర గ్రాలు రాస్ బెర్రీ కలర్ 3 చుక్కలు వెనీలా ఎసెన్స్ 3 చుక్కలు తయారుచేసే విధానం ఒక గిన్నెలో ఖుర్బానీలను వేసి నిండా మునిగేట్టుగా నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి. తర్వాత ఒక్కో ఖుర్బానీకి చాకుతో గాటు పెట్టి లోపలున్న గింజను తీసేయాలి. ఈ గింజలన్నీ విరగ్గొట్టి లోపలున్న పలుకులను నీళ్లల్లో వేసి ఉంచాలి. వెడల్పాటి ప్యాన్లో ఈ నానిన ఖుర్బానీలు నీళ్లతో పాటు మరిగించండి. అవి మెత్తగా ఉడికిన తర్వాత చక్కెర వేయాలి. గరిటతో కలుపుతూ ఉండాలి. అది కరిగి చిక్కపడ్డాక కలర్, ఎసెన్స్ వేసి దింపేయాలి. కలర్ వేయకున్నా ఫర్లేదు. ఎసెన్స్ బదులు యాలకుల పొడి వేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఫ్రిజ్లో పెట్టాలి. ఈ ఖుర్బానీ కా మీఠాను క్రీమ్, కస్టర్డ్ లేదా ఐస్క్రీమ్తో సర్వ్ చేయొచ్చు లేదా నానపెట్టిన ఖుర్బానీ గింజలు పొట్టు తీసి సన్నగా కట్ చేసి పైన అలంకరించి వడ్డించాలి. తయారుచేసే విధానం బ్రెడ్ స్లైసులు పంచదార యాలకుల పొడి డబల్ కా మీఠా కావలసిన పదార్థాలు కాజు, బాదాం, పిస్తా పాలు నెయ్యి లేదా నూనె 8 250గ్రా.లు 1 టీ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ 1/2 8. వేయించడానికి పాలల్లో యాలకుల పొడి వేసి పావు వంతు అయ్యేవరకు మరిగించాలి. పంచదారలో అరకప్పు నీళ్లు పోసి తీగపాకం వచ్చేవరకు మరిగించాలి. బ్రెడ్ ముక్కలు అంచులు తీసేసి త్రికోణంలా కట్ చేసుకోవాలి. వేడి నూనెలో కాని నెయ్యిలో కాని వీటిని బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఒక వెడల్పాటి పళ్లెంలో ఈ బ్రెడ్ ముక్కలను పరిచి ఈ తీగపాకం అన్నింటి మీదా పోయాలి. బ్రెడ్ ముక్కలు పాకం మొత్తాన్ని పీల్చుకున్న తర్వాత చిక్కబడిన పాలు పోయాలి. దానిపైన సన్నగా కట్ చేసుకున్న కాజు, బాదాం, పిస్తా ముక్కలు వేసి వేడిగా కాని, చల్లగా కాని సర్వ్ చేయాలి. 288
పుట:తెలంగాణ రుచులు.pdf/309
స్వరూపం