Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేపలు మసాలా వేపుడు - 8 కావలసిన పదార్థాలు చేపలు 500 గ్రా. అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ జీలకర్ర పొడి మెంతిపొడి 1/2 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ పసుపు 1/4 టీ స్పూన్ గరం మసాలాపొడి 1/4 టీ స్పూన్ కారంపొడి 1 టీ స్పూన్ ఉప్పు తగినంత ధనియాల పొడి 2 టీ స్పూన్స్ నూనె 1/4 కప్పు తయారుచేసే విధానం ఒక గిన్నెలో పసుపు, కారంపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్లు చిలకరించి ముద్దలా చేసుకోవాలి. నీళ్ల బదులు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. శుభ్రంగా కడిగి వెడల్పుగా కోసిన చేప ముక్కలకు ఈ మసాలా రెండు వైపులా పట్టించి అరగంట నాననివ్వాలి. పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాసి ఈ ముక్కలు పెట్టి కాల్చాలి. మధ్య మధ్యలో నూనె వేస్తూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. వీటిని కడాయిలో నూనె వేడి చేసి కూడా వేయించుకోవచ్చు. చేపలు మెంతి పులుసు - 9 కావలసిన పదార్థాలు చేపలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కారంపొడి జీలకర్ర పొడి మెంతిపొడి తయారుచేసే విధానం టమాటాలు 500 గ్రా. 2 అల్లం, వెల్లుల్లి ముద్ద చింతపండు పులుసు 2 టీ స్పూన్స్ 1/2 కప్పు 2 4 మెంతికూర 1 కట్ట 2 రెబ్బలు 1/4 టీ స్పూన్ గరం మసాలాపొడి 1/4 టీ స్పూన్ 1 టీ స్పూన్ ఉప్పు 1 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ నూనె తగినంత 4 టేబుల్ స్పూన్స్ శుభ్రంగా కడిగిన చేపలను ముక్కలుగా కోసి ఉప్పు, కారంపొడి, పసుపు, జీలకర్ర పొడి, మెంతిపొడి, చింతపండు పులుసు వేసి బాగా కలిపి, గంటసేపు నాననివ్వాలి. వెడల్పుగా ఉన్న గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి, మెంతికూర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. ముక్కలు మెత్తబడ్డాక చేప ముక్కలు వేసి మెల్లిగా కలిపి మూతపెట్టి చిన్న మంటమీద ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. నూనె తేలుతున్నప్పుడు గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ రుచ 272