500 గ్రా. చేపలు వేపుడు - 6 కావలసిన పదార్థాలు చేపలు జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ ఉల్లిపాయలు 2 మెంతిపొడి 1/4 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ గరం మసాలాపొడి పసుపు 1/4 టీస్పూన్ ఉప్పు 1/4 టీ స్పూన్ తగినంత కరివేపాకు 2 రెబ్బలు నిమ్మరసం 2 టేబుల్ స్పూన్స్ కారంపొడి 1 టీ స్పూన్ నూనె ధనియాల పొడి 1 టీ స్పూన్ తయారుచేసే విధానం 4 టేబుల్ స్పూన్స్ చేపలు శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పసుపు, కారంపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, ఉప్పు వేసి కలిపి చేపముక్కలు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు లేదా నూరిన ఉల్లిపాయలు వేసి దోరగా అయ్యేవరకు వేయించి, తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత చేపముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. ఒకవైపు ముక్కలు వేగిన తర్వాత మెల్లిగా తిరగేసి మూతపెట్టాలి. రెండోవైపు కూడా వేగి, ఉడికిన తర్వాత నిమ్మరసం, గరం మసాలా పొడి వేసి దింపేయాలి. ఈ వేపుడు నిదానంగా చిన్న మంటమీద చేస్తే ముక్కలు బాగా ఉడికి ఎర్రగా వేగుతాయి. నీళ్లు పోసే పని ఉండదు. చేపలు మిరియాల వేపుడు - 7 కావలసిన పదార్థాలు చేపలు 500 గ్రా. అల్లం, వెల్లుల్లి ముద్ద పసుపు 1 టీ స్పూన్ టీ 1/4 టీ స్పూన్ 1 టీ స్పూన్ మిరియాలపొడి ఉప్పు నూనె తగినంత 1/4 కపు నిమ్మకాయలు తయారుచేసే విధానం 2 ఒక గిన్నెలో ఉప్పు మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి వెడల్పుగా కోసిన చేప ముక్కలు వేసి మసాలా బాగా కలపాలి. రెండువైపులా మసాలా బాగా పట్టించి అరగంట నాననివ్వాలి. తర్వాత పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. ఒకో చేప ముక్క పెట్టి నిదానంగా కాల్చాలి. మధ్య మధ్యలో నూనె వేస్తూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ చేపల వేపుడు కడాయిలో నూనె వేడి చేసి కూడా కాల్చుకోవచ్చు. తెలంగాణ 271 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/292
స్వరూపం