తెలంగాణ చేపలు, మామిడికాయ - 4 కావలసిన పదార్థాలు చేపలు ఉల్లిపాయలు 1 కేజి ధనియాల పొడి 2 టీ స్పూన్స్ 3 జీలకర్ర పొడి 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెబ్బలు మెంతిపొడి 1/4 టీ స్పూన్ మామిడికాయలు 2 గరం మసాలాపొడి 1/4 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ ఉప్పు తగినంత పసుపు 1/2 టీ స్పూన్ నూనె 4 టేబుల్ స్పూన్స్ కారంపొడి 2 టీ స్పూన్స్ తయారుచేసే విధానం చేపలు శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పసుపు, కారంపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, ఉప్పు, చెంచాడు నూనె వేసి బాగా కలిపి చేపముక్కలకు పట్టించాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత మామిడికాయ తురుము లేదా ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. కాస్త మగ్గిన తర్వాత మసాలా పట్టించిన చేప ముక్కలు వేసి మూత పెట్టాలి. చేప ముక్కలు రెండు వైపులా వేగిన తర్వాత కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. మొత్తం కూర ఉడికి దగ్గరపడ్డ తర్వాత గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. చేపలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు I చేపలు, చింతచిగురు - 5 1 కేజి 3 3 కావలసిన పదార్థాలు - గరం మసాలాపొడి కొబ్బరిపొడి జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్ 3 టేబుల్ స్పూన్స్ 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ 100 గ్రా. తగినంత అల్లం, వెల్లుల్లి ముద్ద రెబ్బలు 2 టీ స్పూన్స్ మెంతిపొడి చింతచిగురు పసుపు 1/2 టీ స్పూన్ ఉపు కారంపొడి 2 టీ స్పూన్స్ నూనె 4 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి 2 టీ స్పూన్స్ తయారుచేసే విధానం చేపలు శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి. చింతచిగురు నలిపి చెరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పసుపు, కారంపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, ఉప్పు కలుపుకుని చేపముక్కలు వేసి బాగా కలిపి ఉంచాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి, దోరగా వేయించి కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, చింతచిగురు వేసి కలపాలి. కొద్దిగా వేగిన తర్వాత మసాలా పట్టించిన చేప ముక్కలు, కొబ్బరిపొడి వేసి మెల్లిగా కలిపి మూతపెట్టాలి. ముక్కలు రెండు వైపులా వేగిన తర్వాత కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికి చిక్కబడ్డ తర్వాత గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. ఇష్టముంటే మామిడికాయ కోరు వేసుకోవచ్చు. 270 రుచుల
పుట:తెలంగాణ రుచులు.pdf/291
స్వరూపం