ఈ పుటను అచ్చుదిద్దలేదు
పీతలు వేపుడు - 3 కావలసిన పదార్థాలు పీతలు ఉల్లిపాయలు టొమాటోలు 250 గ్రా. 2 2 పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ తయారుచేసే విధానం కారం పొడి ధనియాల పొడి కరివేపాకు గరం మసాలా పొడి నూనె టీ 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 2 రెబ్బలు 1/4 టీ స్పూన్ 3 టేబుల్ స్పూన్స్ పీతలు శుభ్రం చేసుకుని పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన లేదా ముద్దగా నూరిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటా ముక్కలు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, కరివేపాకు వేసి కలిపి కొద్దిగా వేయించాలి. తర్వాత ఇందులో పీతల ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. అవి పూర్తిగా ఉడికి నీరంతా ఇగిరిపోయాక దింపేయాలి. 267 తెలంగాణ రుచులు