Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పొట్టురొయ్యలు కారంపొడి - 21 కావలసిన పదార్థాలు పొట్టు రొయ్యలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు శనగపప్పు కరివేపాకు ఉప్పు నూనె - 100 గ్రా.లు 2 టీ స్పూన్స్ 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ 2 రెబ్బలు తగినంత 2 టీ స్పూన్స్ తయారుచేసే విధానం కడాయి వేడి చేసి పొట్టు రొయ్యలు బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, కరివేపాకు కూడా విడివిడిగా దోరగా వేయించి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటన్నింటిని తగినంత ఉప్పు వేసి పొడిచేసి పెట్టుకోవాలి. వేడి అన్నంలో కాస్త నూనె/నెయ్యి, ఈ కారం పొడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. 265 తెలంగాణ రుచులు