Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రొయ్యలు, చింతకాయ పులుసు - 15 కావలసిన పదార్థాలు రొయ్యలు చింతకాయ పులుసు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం, వెల్లుల్లి ముద్ద తయారుచేసే విధానం 250గ్రా.లు పసుపు 1/4 కప్పు కారంపొడి 2 ధనియాల పొడి 2 గరం మసాలా పొడి 2 రెబ్బలు ఉప్పు 12 టీ స్పూన్ నూనె 1/4 టీ స్పూన్ 1/2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ టీ తగినంత 4 టేబుల్ స్పూన్స్ రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. లేత చింతకాయలు దంచి, కొన్ని నీళ్లు పోసి ఉడికించి చిక్కగా పులుసు తీసుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా వేగిన తర్వాత రొయ్యలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. రొయ్యలు బాగా వేగిన తర్వాత చిన్న కప్పుడు నీళ్లు పోసి కలిపి ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత చింతకాయ పులుసు వేసి చిక్కగా అయ్యేవరకు మూతపెట్టి ఉడికించి గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. గుండు రొయ్యలు కూర - 16 కావలసిన పదార్థాలు గుండు రొయ్యలు ఉల్లిపాయలు 100 గ్రా.లు కారంపొడి 1 టీ స్పూన్స్ 2 ధనియాల పొడి పచ్చిమిర్చి 2 గరం మసాలా పొడి 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ కరివేపాకు 2 రెబ్బలు ఉప్పు తగినంత అల్లం, వెల్లుల్లి ముద్ద పసుపు 1 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ నూనె 4 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం కడాయి వేడి చేసి ఎండు రొయ్యలు దోరగా వేయించుకుని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. గిన్నెలో నూనెవేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో నిలువుగా చీఇ్చన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద ఒకటి తర్వాత ఒకటి వేసి కొద్దిగా వేగిన తర్వాత కారంపొడి, ధనియాల పొడి వేసి కలిపి నానిన రొయ్యలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. రొయ్యలు బాగా వేగిన తర్వాత చిన్న కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. రొయ్యలు బాగా ఉడికి నీరంతా ఇగిరిపోయిన తర్వాత గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. ఇందులో టమాటాలు కాని ఏదైనా ఆకుకూర కూడ వేసుకోవచ్చు. తెలంగాణ రుచ 262