Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రొయ్యలు, మామిడికాయ - 13 కావలసిన పదార్థాలు రొయ్యలు మామిడికాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు తయారుచేసే విధానం అల్లం, వెల్లుల్లి ముద్ద ధనియాల పొడి 12 టీ స్పూన్ గరం మసాలా పొడి కారంపొడి 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 250గ్రా.లు 1 పెద్దది 2 2 2 రెబ్బలు ఉప్పు 1/4 టీస్పూన్ నూనె 1/4 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. మామిడికాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో పసుపు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, ధనియాల పొడి వేసి కలపాలి. తర్వాత రొయ్యలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. రొయ్యలు బాగా వేగిన తర్వాత చిన్న కప్పుడు నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. రొయ్యలు, ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. రొయ్యలు, మామిడికాయ పూర్తిగా ఉడికిన తర్వాత గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. రొయ్యలు, చింతచిగురు - 14 కావలసిన పదార్థాలు రొయ్యలు చింతచిగురు 250గ్రా.లు పసుపు 1/4 టీ స్పూన్ 100 గ్రా.లు కారంపొడి 1/2 టీ స్పూన్స్ ఉల్లిపాయలు 2 ధనియాల పొడి పచ్చిమిర్చి 2 గరం మసాలా పొడి కరివేపాకు 2 రెబ్బలు 1/2 టీ స్పూన్ ఉపు 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ తగినంత నూనె అల్లం, వెల్లుల్లి ముద్ద తయారుచేసే విధానం 4 టేబుల్ స్పూన్స్ రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. చింతచిగురు బాగా నలిపి చెరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో పసుపు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపి, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా వేపి రొయ్యలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. రొయ్యలు బాగా వేగిన తర్వాత చిన్న కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత చింతచిగురు వేసి కలిపి దగ్గరగా అయ్యేవరకు ఉడికించి గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. ఇష్టముంటే ఇందులో మామిడికాయ కూడా వేసుకోవచ్చు. తెలంగాణ 261 రుచులు